iDreamPost

EPFO: కేంద్రం కీలక నిర్ణయం.. ఉద్యోగులకు శుభవార్త.. వేతన పరిమితి భారీగా పెంపు

  • Published Apr 12, 2024 | 8:21 AMUpdated Apr 12, 2024 | 8:21 AM

ఈపీఎఫ్ఓ చందాదారులకు సంబంధించి కేంద్ర ప్రభత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. దీని వల్ల గరిఫ్ట వేతన పరిమితి భారీగా పెరగనుంది. ఆ వివరాలు..

ఈపీఎఫ్ఓ చందాదారులకు సంబంధించి కేంద్ర ప్రభత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. దీని వల్ల గరిఫ్ట వేతన పరిమితి భారీగా పెరగనుంది. ఆ వివరాలు..

  • Published Apr 12, 2024 | 8:21 AMUpdated Apr 12, 2024 | 8:21 AM
EPFO: కేంద్రం కీలక నిర్ణయం.. ఉద్యోగులకు శుభవార్త.. వేతన పరిమితి భారీగా పెంపు

కేంద్ర ప్రభుత్వం ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్)కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనుంది. దీనిలో భాగంగా ఉద్యోగులకు శుభవార్త చెప్పడానికి రెడీ అయ్యింది. ఇక కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్- ఈపీఎఫ్ఓ) కింద ఉన్న ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 15 వేలుగా ఉంది. దానిని ఇప్పుడు ఏకంగా 40 శాతం అంటే దాన్ని ఏకంగా రూ. 21 వేలకు పెంచనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ పరిమితిని పెంచాలని కార్మిక సంఘాలు, అనుబంధ సంస్థలు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం వేతన పరిమితి పెంపు మీద దృష్టి సారించిందని ఇంగ్లీష్ మీడియా కథనాలు వెల్లడిస్తోంది. ఇదే జరిగితే ఉద్యోగులకు పండగే అని చెప్పవచ్చు.

Centers key decision is good news for employees

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దాంతో వేతన పరిమితి పెంపు నిర్ణయం కొత్త ప్రభుత్వ హయాంలోనే ఉంటుందని ఓ సీనియర్ అధికారి చెప్పుకొచ్చారు. ఇక వేతన పరిమితి పెంచడం కారణంగా ప్రభుత్వం సహా ప్రైవేట్ రంగంపైనా అదనపు భారం పడుతుంది. కానీ ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు మాత్రం మేలు జరగనుంది. చివరి సారి 2014లో ఈపీఎఫ్ఓ గరిష్ట పరిమితిని సవరించడం జరిగింది. అప్పుడు రూ. 6500 గా ఉన్న లిమిట్‌‌ను ఏకంగా రూ. 15 వేలకు పెంచారు.

ఆ తర్వాత గత పదేళ్లుగా ఇదే వేతన పరిమితి అమల్లో ఉంది. త్వరలో దీన్ని పెంచితే.. అప్పుడు గరిష్ట పరిమితి 21 వేల రూపాయలు కానుంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) వేతన పరిమితిని రూ. 21 వేలకు పెంచింది. దీంతో ఈపీఎఫ్ కూడా ఆ మొత్తానికే చేర్చాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

ఉద్యోగులకు కలిగే లాభం ఏంటి..

పీఎఫ్ వేతన పరిమితి పెంచినట్లయితే ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాలో జమయ్యే మొత్తం కూడా అదే స్థాయిలో పెరుగుంది. ప్రస్తుతానికి ఉద్యోగి పీఎఫ్ కటింగ్ లో భాగంగా.. ఉద్యోగి వాటాగా జీతంపై 12 శాతం, యజమాని వాటా 12 శాతం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగి వాటా 12 శాతం మొత్తం పీఎఫ్ అకౌంట్లోనే జమవుతుంది. ఈ మొత్తంపై ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం ఆ మొత్తం మీద వడ్డీని కూడా జమ చేస్తుంది.

ఇక యజమాని చెల్లించే 12 శాతం వాటా నుంచి 8.33 శాతం పెన్షన్ స్కీమ్‌లో.. మిగిలిన మొత్తం ఈపీఎఫ్ ఖాతాలోకి చేరుతుంది. ఇప్పుడు గరిష్ట వేతన పరిమితి పెంచిటన్లయితే.. ఉద్యోగి,యజమాని చెల్లించాల్సిన పీఎఫ్ వాటా మొత్తం పెరుగుతుంది. ఫలితంగా ఈపీఎఫ్ఓ, ఈపీఎస్ అకౌంట్లలో సేవ్ అయ్యే మొత్తం కూడా పెరుగుతుంది. దీంతో రిటైర్మెంట్ సమయానికి ఉద్యోగి తన పీఎఫ్ అకౌంట్లో భారీ మొత్తం ఉండే అవకాశం కలగనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి