iDreamPost

‘బ్రో’ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..?

  • Author ajaykrishna Updated - 11:03 AM, Sat - 29 July 23
  • Author ajaykrishna Updated - 11:03 AM, Sat - 29 July 23
‘బ్రో’ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..?

థియేట్రికల్ సినిమాలు ఓటిటిలోకి వెంటవెంటనే వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు భారీ అంచనాల మధ్య విడుదలైన కొత్త సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బ్రో. తమిళ సూపర్ హిట్ ‘వినోదయ సితం’ మూవీకి అధికారిక రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. ఒరిజినల్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్, యాక్టర్ సముద్రఖని.. తెలుగులో పవన్, సాయి ధరమ్ తేజ్ లను పెట్టి తెరకెక్కించాడు. ఇందులో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. కాగా జులై 28న సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఆల్రెడీ ఈ సినిమా రీమేక్ కాబట్టి.. ఒరిజినల్ చూసేసిన వారికి స్టోరీ పరంగా కొత్తదనం ఏమి కనిపించదు. కానీ.. క్యారెక్టరైజేషన్ పరంగా సినిమా ఒకసారి చూడొచ్చని అంటున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించాడు. సాంగ్స్ పర్వాలేదు అనిపించినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెప్పిస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. హీరోలకు ఉన్న క్రేజ్ పరంగా.. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉంది. మొదటి రోజు మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. దాదాపు రూ. 98 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగినట్లు ట్రేడ్ వర్గాల టాక్. మరి రీమేక్ సినిమాకి ఆ స్థాయిలో బిజినెస్ అంటే.. రీచ్ అవుతుందో లేదో అని అంటున్నారు.

ఇదిలా ఉండగా.. నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే సినిమాకి పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా వచ్చేసిందట. ఇక ఇప్పుడు థియేట్రికల్ గా సినిమా ఎంత కలెక్షన్స్ అందిస్తుందో.. తాజగా బ్రో సినిమా ఓటీటీ రిలీజ్ గురించి వార్తలు వైరల్ గా మారాయి. బ్రో ఓటిటి హక్కులను మొదట అమెజాన్ ప్రైమ్ దక్కించుకోవడానికి గట్టిగా ట్రై చేసినా.. నెట్ ఫ్లిక్స్ నుండి మంచి ఆఫర్ రావడంతో నిర్మాతలు దానికే అమ్మేసినట్లు తెలుస్తోంది. మరి థియేట్రికల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన బ్రో.. ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుంది అనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వస్తున్నాయి. ఓటిటి ఒప్పందం ప్రకారం.. 50 రోజుల తర్వాత బ్రో సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని టాక్ వినిపించింది. కానీ.. సినిమా ఫలితాన్ని బట్టి మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం. మరి బ్రో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి