iDreamPost

రాజధాని పై బిజెపి నేత కీలక వ్యాఖ్యలు

రాజధాని పై బిజెపి నేత కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని ఎంపిక చేసుకొనే హక్కు ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళిధర రావు స్పష్టం చేశారు. బుధవారం నెల్లూరు పర్యటనకి వచ్చిన మురళిధర రావు బిజెపి జిల్లా ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారాన్ని అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చెయ్యకుండా ఇతర ప్రాంతాలకు పరిమితం చెయ్యడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార మరియు అభివృద్ధి వికేంధ్రీకరణలో భాగంగా విశాఖ పట్టణానికి, కర్నూల్ కి రాజధానిని విస్తరించడం ద్వారా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజధాని అంశంపై ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన ప్రకటన చెయ్యని కేంద్రప్రభుత్వ వైఖరి పై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న తరుణంలో బిజెపి అధిష్టానంతో చాలా సన్నిహితంగా ఉండే మురళీధర రావు ఈ వ్యాఖ్యలు చెయ్యడం విశేషం. ఒక పక్క బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇటీవల కాలంలో రాజధానిని అంగుళం కూడా కదిలించడానికి వీలు లేదంటూ  రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడడం, దానికి భిన్నంగా జీవియల్ నరసింహారావు, మురళీధర రావు వంటి సీనియర్ నాయకులు రాజధాని పై కేంద్రం జోక్యం చేసుకోబోదని స్పష్టం చెయ్యడంతో బిజెపి అగ్రనాయకత్వంతో ఈ ఇరువురు నేతలకు ఉన్న పరపతి దృష్యా రాజధానికి అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా ఇదేనని భావించొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి