iDreamPost

ఆ గ్రామంలోకి వెళ్లాలంటే టోల్ ఫీజు కట్టాల్సిందే.. ఎక్కడంటే!

సాధారణంగా ఎక్కడైనా జాతీయ రహదారులపై టోల్ ఫీజుల ఉంటాయి. అలానే వివిధ ప్రత్యేక ప్రదేశాల్లో కూడా టోల్ ఫీజులు వసూలు చేస్తుంటారు. అయితే ఎక్కడైనా గ్రామాల్లోకి వెళ్లాలంటే టోల్ ఫీజుల ఉంటుందా.? . ఓ గ్రామంలోకి వెళ్లాలంటే మాత్రం తప్పని సరిగా టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

సాధారణంగా ఎక్కడైనా జాతీయ రహదారులపై టోల్ ఫీజుల ఉంటాయి. అలానే వివిధ ప్రత్యేక ప్రదేశాల్లో కూడా టోల్ ఫీజులు వసూలు చేస్తుంటారు. అయితే ఎక్కడైనా గ్రామాల్లోకి వెళ్లాలంటే టోల్ ఫీజుల ఉంటుందా.? . ఓ గ్రామంలోకి వెళ్లాలంటే మాత్రం తప్పని సరిగా టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఆ గ్రామంలోకి వెళ్లాలంటే టోల్ ఫీజు కట్టాల్సిందే.. ఎక్కడంటే!

సాధారణంగా ఎక్కడైనా వాహనాలు జాతీయ రహదారులపై వెళ్తున్న సమయంలో కొన్ని చోట్ల టోల్ గేట్లు ఉంటాయి. అక్కడ టోల్ ఫీజులు చెల్లిస్తేనే.. అక్కడి నుంచి ముందుకు వెళ్లేందుకు అనుమతి. అలానే కొన్ని కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో టోల్ ఫీజు, ఎంట్రీ ఫీజు కడితేనే లోపలికి అనుమతిస్తారు. అయితే ఎవరైనా గ్రామాలకు టోల్ ఫీజు పెడతారా?. అంటే అవును పెడతారు అనే సమాధానం వస్తుంది. ఓ గ్రామంలోకి వెళ్లాలంటే టోల్ ఫీజు కట్టాల్సిందే. ఆ  గ్రామం కూడా ఎక్కడో లేదు..ఏపీలోని కర్నూలు జిల్లాలో ఉంది. మరి.. ఆ గ్రామంలో ఆ టోల్ ఫీజు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో తత్తూరు గ్రామంలోకి వెళ్లాలంటే కచ్చితంగా టోల్ గేట్ దగ్గర ఫీజు చెల్లించాల్సిందే. అందుకు స్థానికులు ఓ కారణం చెబుతున్నారు. ఇటీవలే ఈ గ్రామంలో శ్రీ తత్తూరు రంగనాథ స్వామి తిరునాళ్లను ప్రారంభమైంది. ఈ వేడుకను పురస్కరించుకొని స్వామి అమ్మవార్ల పూజా కార్యక్రమాలు అన్ని మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఈ టోల్ వసూలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి తిరునాళ్ల కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇక అప్పటి నుంచి మే 1 తేదీ వరకు తత్తూరు గ్రామంలోకి వెళ్లాలంటే కచ్చితంగా రుసుము చెల్లించాల్సిందే స్థానికులు కొందరు చెబుతున్నారు.

ఏటా ఒకసారి శ్రీ శ్రీ తత్తూరు రంగనాథ స్వామి తిరునాళ్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ తిరునాళ జరిగే నెల రోజుల పాటు తత్తూరు గ్రామంలో పండగా వాతవరణం ఉంటుంది. ఎక్కడ చూసిన రంగులమయంగా ఉంటుంది. గ్రామ పెద్దలు అందరూ కలిసి తమ గ్రామం మేలు కొరకే ఈ తిరునాళ్లను నిర్వహిస్తారని చెబుతున్నారు గ్రామస్తులు. సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ తిరునాళ్లు సందర్భంగా అందరూ కలిసి ఒక టోల్ గేట్‌ని ఏర్పాటు చేయడం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. తిరునాళ్లకు ముందుగా టోల్ ఫీజు కోసం వేల పాట పాడుతారు. అందులో ఎవరైతే ఎక్కువ డబ్బులకు పాడుతారో వారికి ఈ టోల్‌గేట్ ఫీజులు వసూలు చేసే అవకాశం దక్కుతుంది.

ఏటా మాదిరిగానే ఈ సారి కూడా ఈ టోల్‌గేట్ విలువ 2.80 లక్షలు పలికింది. ఈ తత్తూరు రంగనాథ స్వామి తిరునాళ్లలో రకరకాలవిలువైన వస్తువులను అమ్మకాలు, కొనుగోలు జరుపుతుంటారు. ముఖ్యంగా రైతులకు కావలసినటువంటి పనిముట్లు ఇక్క డ చాలా ఫేమస్. అంతే కాదు అన్ని రకాల ఆహార పదార్ధాలు ఇక్కడ లభిస్తాయి. అందులో ముఖ్యంగా చికెన్ కడ్డీలు, చికెన్ చపాతి చాలా రుచికరంగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. మొత్తంగా ఈ తిరునాళ్ల జరిగినన్ని రోజులు ఈ గ్రామంలోకి వెళ్లాలంటే…టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి