iDreamPost

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేస్తారా? పోలీస్ స్టేషన్ వద్ద లాయర్ చెప్పిన నిజాలు!

పల్లవి ప్రశాంత్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అతడి లాయర్ వెల్లడించారు. ప్రశాంత్ తో ఫోన్ లో మాట్లాడానని, అతడి ఆరోగ్యం బాలేక బయటకి రావట్లేదని పలు కీలక విషయాలు తెలియపరిచారు.

పల్లవి ప్రశాంత్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అతడి లాయర్ వెల్లడించారు. ప్రశాంత్ తో ఫోన్ లో మాట్లాడానని, అతడి ఆరోగ్యం బాలేక బయటకి రావట్లేదని పలు కీలక విషయాలు తెలియపరిచారు.

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేస్తారా? పోలీస్ స్టేషన్ వద్ద లాయర్ చెప్పిన నిజాలు!

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇక అతడు బిగ్ బాస్ గెలిచిన అనంతరం అన్నపూర్ణ స్టూడియో బయట ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సహనం కోల్పోయిన ప్రశాంత్ ఫ్యాన్స్ ఆర్టీసీ బస్సుల అద్దాలతో పాటుగా, అమర్ దీప్ ఫ్యామిలీ వెళ్తున్న కారు అద్దాలను సైతం ధ్వంసం చేశారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ కోసం పోలీసులు వెతుకుతున్నారన్న వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే తాను ఎక్కడికీ పోలేదు, ఇంటి దగ్గరే ఉన్నాను అంటూ ప్రశాంత్ ఇన్ స్టాగ్రామ్ లో వీడియో రిలీజ్ చేశాడు. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ లాయర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని కేసు వివరాలను వెల్లడించారు. లాయర్ మాట్లాడుతూ..”పల్లవి ప్రశాంత్ పై ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారు? ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది? అనే విషయాలు ఏవీ చెప్పలేదు. మేము FIR కాపీ కోసం వచ్చాము. అది వారి తల్లిదండ్రులకే ఇస్తామని పోలీసులు చెప్పారు. దాంతో మేము వారికి ఈ విషయాన్ని తెలియపరిచాము. వాళ్ల ఊరు నుంచి వారు రావడానికి టైమ్ పడుతుంది” అంటూ చెప్పుకొచ్చారు పల్లవి ప్రశాంత్ లాయర్.

పల్లవి ప్రశాంత్.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన పేరు. బిగ్ బాస్ విన్నర్ గా గెలిచిన సంతోషం కూడా అతడికి లేదు పాపం. పల్లవి ప్రశాంత్ విజయోత్సవ ర్యాలీలో ఆర్టీసీ బస్సు అద్దాల ధ్వంసంతో పాటుగా బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ కారుపై దాడి కేసులో అతడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక మూడు బృందాలు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లుగా వార్తలు కూడా వస్తున్నాయి. అయితే తాను ఎక్కడికి వెళ్లలేదని ఇంటి దగ్గరే ఉన్నానని ఇన్ స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేశాడు పల్లవి ప్రశాంత్. కానీ అతడు ఎక్కడ ఉన్నాడో మాత్రం ఎవ్వరికీ తెయడం లేదు. ఇన్ని ట్విస్టుల మధ్య పల్లవి ప్రశాంత్ లాయర్ ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు.

తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన లాయర్ మీడియాతో పలు ఆసక్తికర వివరాలు వెల్లడించారు. లాయర్ మీడియాతో మాట్లాడుతూ..”పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన FIR కాపీని తీసుకెళ్లడానికి ఇక్కడి వచ్చాం. అది వారి తల్లిదండ్రులకు మాత్రమే ఇస్తామని పోలీసులు తెలిపారు. దీంతో ఈ విషయాన్ని మేము వారికి తెలియపరిచాము. అతడి తల్లిదండ్రులు ఇక్కడి వచ్చే సరికి సమయం పడుతుంది. ఎఫ్ఐఆర్ కాపీ వస్తేనే ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఆ కాపీలో వారు ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? నాన్ బెయిల్ ఆర్ బెయిలబుల్ కేసు నమోదు చేశారా? అన్న విషయాలు చెప్పలేదు. పోలీసులు వారి పని వారు చేస్తున్నారు. త్వరలోనే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నాను, పోలీసులు కూడా ఇదే ఆశిస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చారు ప్రశాంత్ తరపు లాయర్.

ఇక పల్లవి ప్రశాంత్ తమ్ముడిని అరెస్ట్ చేశారు అంటూ వచ్చిన వార్తలు ఇంత వరకు తమకు తెలియలేదని ఆయన పేర్కొన్నారు. ఇక తాను ప్రశాంత్ తో మాట్లాడాను అని, ఈ కేసుకు సంబంధించిన విషయాలు తన తల్లిదండ్రులు చూసుకుంటారని, తనకు ఆరోగ్యం బాలేదని తనతో ఫోన్ లో చెప్పినట్లు లాయర్ వివరించారు. ఇక ఈ కేసులో కారు, బస్సు అద్దాలు ధ్వంసం చేసింది ఎవరు? అమర్ దీప్ ఫ్యాన్స్ హా, లేక పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ హా అన్నది కంప్లైట్ కాపీలో ఎఫ్ఐఆర్ కాపీ చూస్తూ ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలుస్తాయని ఈ సందర్భంగా లాయర్ చెప్పుకొచ్చాడు. మరి ఈ కేసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి