iDreamPost
android-app
ios-app

వారికోసం సూపర్ స్కీమ్.. 8.2 శాతం వడ్డీతో నెలకు 20 వేల వరకు ఆదాయం..

Best Savings Scheme: చాలా స్కీమ్స్ రూపంలో డబ్బు దాచుకోవాలి అనుకుంటారు. అలా చేస్తే వడ్డీ రూపంలో ఆదాయం కూడా వస్తుంది. అలాంటి స్కీముల కోసం చూసే వారికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి.

Best Savings Scheme: చాలా స్కీమ్స్ రూపంలో డబ్బు దాచుకోవాలి అనుకుంటారు. అలా చేస్తే వడ్డీ రూపంలో ఆదాయం కూడా వస్తుంది. అలాంటి స్కీముల కోసం చూసే వారికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి.

వారికోసం సూపర్ స్కీమ్.. 8.2 శాతం వడ్డీతో నెలకు 20 వేల వరకు ఆదాయం..

సాధారణంగా అందరూ ఖర్చులు పెడుతూ ఉంటారు. కానీ, చాలా కొద్ది మంది మాత్రమే పొదుపు చేయాలి, భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా బతకాలి అని ముందు జాగ్రత్త పడతారు. అలాగే చాలామంది రిటైర్మెంట్ తర్వాత కూడా తమకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఎక్కువగా సేవింగ్స్, ఫిక్సిడ్ డిపాజిట్లు చేస్తూ ఉంటారు. అలాంటి వారకి ఇది మంచి సేవింగ్స్ ఆప్షన్ అనే చెప్పాలి. ఇందులో వారికి 8.2 శాతం వరకు వడ్డీ రావడం మాత్రమే కాకుండా.. నెలకు రూ.20 వేల వరకు ఆదాయం పొందే ఆస్కారం ఉంటుంది. మరి.. ఈ స్కీమ్ ఏంటి? దానిని ఎలా ప్రారంభించాలో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటోంది సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ గురించి. దీనిని మీరు పోస్టాఫీస్ లో ప్రారంభించవచ్చు. ఈ ఖాతాని తెరిచి మీరు పొదుపు చేయడం, మీ డబ్బుని డిపాజిట్ చేయడం ద్వారా మీకు 8.2 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. దీనిని మీరు మీ రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక అవసరాల కోసం వాడుకోవచ్చు. ముఖ్యంగా మీరు జాబ్ నుంచి రిటైర్ అయ్యిన తర్వాత ఎవరిపై ఆధారపడకుండా మీ అవసరాలను మీరు తీర్చుకోగలరు. ఈ స్కీమ్ లో చేరేందుకు మీరు పోస్టాఫీస్ కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీరు రూ.1000తో ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ను తెరవచ్చు.

ఈ ఎస్సీఎస్ఎస్ ఖాతా తెరిచేందుకు ఖాతాదారుడు 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. సివిలియన్ ఎంప్లాయిస్ అయింతే 55 సంవత్సరాలు నిండిన తర్వాత ఖాతా తెరిచేందుకు ఆస్కారం ఉంటుంది. డిఫెన్స్ సర్వీస్ లో రిటైర్ అయిన వారికి కొన్ని షరుతల నేపథ్యంలో 50 ఏళ్లు దాటిన తర్వాత ఈ స్కీమ్ లో చేరచ్చు. ఇందులో మీరు కనీసం రూ.వెయ్యితో ఖాతా తెరవచ్చు. ఆ తర్వాత మీరు గరిష్ఠంగా 30 లక్షల వరకు డిపాజిట్ చేయచ్చు. గతంలో ఇందులో మీరు రూ.15 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయగలిగే వాళ్లు. కానీ, తాజాగా ఆ లిమిట్ ని రూ.30 లక్షలకు పెంచారు. మీరు ఇందులో మొత్తం 5 ఏళ్లకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

ఈ స్కీమ్ లో మీకు ఏడాదికి 8.2 శాతం వడ్డీ దక్కుతుంది. మీకు కావాలి అంటే దీనిని ఎక్స్ టెండ్ కూడా చేసుకోవచ్చు. మరో మూడేళ్లకు ఈ స్కీమ్ ని పొడిగించుకోవచ్చు. అయితే మీకు నాలుగో ఏడాదిలో ఎక్స్ టెన్షన్ కు ఛాన్స్ ఇస్తారు. ఇందులో మీకు ప్రీ క్లోజర్ కూడా ఉంటుంది. మీకు కావాలి అంటే ముందే దీనిని క్లోజ్ చేసి మీ డిపాజిట్ ను తీసుకోవచ్చు. అయితే ఏడాది తర్వాత మాత్రమే మీరు ప్రీక్లోజర్ చేయగలరు. ఇందుకు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, ప్రిన్సిపుల్ అమౌంట్ నుంచి 1.5 శాతం ఛార్జ్ వసూలు చేస్తారు. అదే మీరు రెండో సంవత్సరం తర్వాత విత్ డ్రా చేసుకుంటే కేవలం 1 శాతం మాత్రమే డిడక్షన్ ఉంటుంది. అయితే మీరు అలా చేస్తే అంత బెనిఫిట్ ఉంటదు.

ఈ సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ కు రూ.లక్షన్నర వరకు ఫామ్ 80సీ కింద ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇందులో మీకు నామినీని ఎంచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. డిపాజి చేసే సమయంలో లక్షలోపు ఉంటే నగదు రూపంలో డిపాజిట్ చేయచ్చు. రూ.లక్షకు మించి మీరు డిపాజిట్ చేయాలి అంటే చెక్ రూపంలో డిపాజిట్ చేయాలి. మీరు గనుక రూ.30 లక్షలను ఈ సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే మీకు ఏడాదికి రూ.2.46 లక్షల వరకు వడ్డీ లభిస్తుంది. అంటే మీకు నెలకు రూ.20 వేల వరకు వడ్డీ రూపంలో ఆదాయం లభిస్తుంది. మరి.. ఈ సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి