iDreamPost

వీడియో: ట్రాఫిక్‌ పోలీసుల సాహసం.. సినిమా స్టైల్లో ఛేజింగ్‌!

ట్రాఫిక్‌ పోలీసు సినిమా స్టైల్లో ఛేజింగ్‌ మొదలుపెట్టాడు. అనుకున్నది సాధించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష్‌ల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్రాఫిక్‌ పోలీసు సినిమా స్టైల్లో ఛేజింగ్‌ మొదలుపెట్టాడు. అనుకున్నది సాధించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష్‌ల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో: ట్రాఫిక్‌ పోలీసుల సాహసం.. సినిమా స్టైల్లో ఛేజింగ్‌!

పోలీసులు-ఛేజింగ్‌ అంటే మనకు సాధారణంగా సినిమాలే గుర్తుకు వస్తాయి. క్రిమినల్‌ కళ్లముందు నుంచి తప్పించుకుని పారిపోతున్నపుడు పోలీసులు ఛేజింగ్‌ మొదలెడతారు. ఆ క్రిమినల్‌ను పట్టుకుంటారు. కానీ, నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. దొంగలు పారిపోతున్నపుడు పోలీసులు ఛేజింగ్‌ చేసి పట్టుకునే సందర్భాలు అత్యంత అరుదుగా ఉంటాయి. ఉన్నా కూడా వాటికి సంబంధించిన దృశ్యాలు వీడియో రూపంలో దొరకటం అంతకంటే అరుదు.

తాజాగా, బెంగళూరులోని ఓ బిజీ రోడ్డులో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. చైన్‌ దొంగతనం చేసి పారిపోతున్న ఓ దొంగను ట్రాఫిక్‌ పోలీసు ఛేజ్‌ చేసి పట్టుకున్నాడు. అది కూడా ఆటోలో వెళుతున్న అతడ్ని.. పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టుకున్నాడు. అతడితో పాటు ఉన్న ఓ లేడీ ట్రాఫిక్‌ పోలీసు బాడీ క్యాంలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని మాగడి ప్రాంతంలోని ఓ రోడ్డులో.. ఓ మగ ట్రాఫిక్‌ పోలీసు, ఓ లేడీ ట్రాఫిక్‌ పోలీసు డ్యూటీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఆటోలో అటు వైపు వచ్చాడు. ఓ మహిళ మెడలో గొలుసు తెంపుకుని ఉడాయించాడు. ఈ విషయం తెలుసుకున్న మగ ట్రాఫిక్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ అతడ్ని వెంబడించాడు. దొంగ ఆటోలో వెళుతుంటే.. పోలీస్‌ ఆటో వెంట పరుగులు మొదలుపెట్టాడు. ఇలా కొంత దూరం పరిగెత్తి ఆటోను పట్టుకున్నాడు. ఆ వెంటనే దొంగను ఆటోలోంచి బయటకు రప్పించాడు. అతడి వద్ద ఉన్న చైన్‌ను స్వాధీనం చేసుకున్నాడు. అతడ్ని పోలీసులకు అప్పగించాడు.

మగ ట్రాఫిక్‌ పోలీసు దొంగను వెంటాడుతున్నపుడు అతడి వెంట లేడీ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ కూడా ఉంది. ఆమె చొక్కాకు ఉన్న బాడీ కెమెరాలో ఛేజింగ్‌కు సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ వీడియోను బెంగళూరు సీపీ తన అఫిషియల్‌ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. ‘‘ బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు కొత్త సంవత్సరాన్ని ఈ విధంగా జరుపుకున్నారు.  చైన్‌ దొంగతనం చేసిన దొంగను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు బాడీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి’’ అని పేర్కొన్నాడు.

ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ సినిమా స్టైల్లో ఛేజింగ్‌ ఉంది. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి’’ .. ‘‘ ఆ ట్రాఫిక్‌ పోలీసులు నిజంగా గ్రేట్‌’’ అని అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి, ఈ  సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి