iDreamPost
android-app
ios-app

అసెంబ్లీలో మరోసారి బాలకృష్ణ రచ్చ! విజిల్స్ వేస్తూ..

  • Published Sep 22, 2023 | 10:05 AM Updated Updated Sep 22, 2023 | 10:12 AM
  • Published Sep 22, 2023 | 10:05 AMUpdated Sep 22, 2023 | 10:12 AM
అసెంబ్లీలో మరోసారి బాలకృష్ణ రచ్చ! విజిల్స్ వేస్తూ..

గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజే టీడీపీ నేతల ఆందోళనతో సభలో గందరగోళం ఏర్పడింది. స్కీల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. అంతేకాక స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి.. తమ నిరసనను తెలియజేశారు. అంతేకాక హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రవర్తించిన తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఇరుపక్షాల మాటల యుద్ధంతో అసెంబ్లీలో ఉద్రికత్త నెలకొంది. రెండో రోజు కూడా అదే తీరు ఏపీ అసెంబ్లీలో కనిపించింది. అలానే  బాలకృష్ణ కూడా అసెంబ్లీ మరోసారి రచ్చ చేశారు. అసెంబ్లీ జరుగుతుండగా విజిల్స్ వేశాడు.

గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో బాలకృష్ణ వికృతంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.  వైసీపీ ఎమ్మెల్యేల వైపు చూస్తూ మీసాలు మెలేయడం, తొడలు కొట్టడం చేశాడు. దీంతో వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అంబటి రాంబాబు అయితే బాలకృష్ణపై ఫైర్ అయ్యారు. నీ మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం సినిమాల్లో చూపించుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా నిండు అసెంబ్లీలో బాలయ్య చేసిన వికృత చేష్టలు వైరల్ గా మారాయి. అసెంబ్లీలో నడుచుకుంటూ వస్తూ చేతితో అసభ్యకరంగా సైగలు చేస్తూ, ఏవో బూతులు తిడుతున్నట్లుగా ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. ఇక దీనిపై వైసీపీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాక బాలకృష్ణకు స్పీకర్ తమ్మినేని కూడా వార్నింగ్ ఇచ్చారు. సభలో  మరోసారి ఇలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలా తొలి రోజు ఇచ్చిన హెచ్చరికలను ఖాతారు చేస్తూ.. రెండో రోజు కూడా బాలకృష్ణ అలానే ప్రవర్తించారు.

ఇదీ చదవండి: అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ వికృత చేష్టలు.. వీడియో వైరల్

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetStarzbetStarzbetJojobetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom