iDreamPost
android-app
ios-app

అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ వికృత చేష్టలు.. వీడియో వైరల్

  • Published Sep 21, 2023 | 4:49 PM Updated Updated Sep 21, 2023 | 4:49 PM
  • Published Sep 21, 2023 | 4:49 PMUpdated Sep 21, 2023 | 4:49 PM
అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ వికృత చేష్టలు.. వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి చంద్రబాబు అరెస్టుతో ఆ పార్టీ నాయకులు, శ్రేణులు మతి భ్రమించినట్లుగా పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనలు చూస్తే టీడీపీ లీడర్ల ప్రవర్తన తీరు ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. చంద్రబాబు అరెస్టు పై ప్రజల నుంచి మద్దతు రాక, చట్టం ముందు నిరూపించుకోలేక టీడీపీ వర్గాలు తీవ్ర నిరాశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీలో బాలయ్య చేతితో చేసిన అసభ్యకరమైన సైగలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య యుద్ధవాతావరణం చోటుచేసుకుంది. దీంతో అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. కాగా ఆ తీర్మానంపై చర్చకు స్పీకర్ నిరాకరించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగి స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే బాలకృష్ణ తాను సినిమా హీరో అన్న సంగతి మరిచి నిండు అసెంబ్లీలో హీరోయిజం చూపించుకుంటూ సభలో నవ్వులపాలయ్యారు. బాలయ్య చేసిన పిచ్చి చేష్టలతో ప్రజలు నవ్వుకుంటున్నారు.

ఎమ్మెల్యే బాలకృష్ణ చంద్రబాబు అరెస్టు అక్రమమని ఊగిపోతూ వైసీపీ ఎమ్మెల్యేలను చూస్తూ తొడకొట్టి, మీసం మెలేసాడు. బాలకృష్ణ చేష్టలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సంప్రదాయాలను గౌరవించాలని, మరోసారి ఈ విధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా నిండు అసెంబ్లీలో బాలయ్య చేసిన వికృత చేష్టలు వైరల్ గా మారాయి. అసెంబ్లీలో నడుచుకుంటూ వస్తూ చేతితో అసభ్యకరంగా సైగలు చేస్తూ, ఏవో బూతులు తిడుతున్నట్లుగా ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. ఇక దీనిపై వైసీపీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ అసభ్యకరంగా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom giriş