iDreamPost
android-app
ios-app

ఇండియన్ గ్రౌండ్స్​పై బాబర్ సెటైర్స్! కట్ చేస్తే అట్టర్ ఫ్లాప్!

  • Author singhj Updated - 10:39 AM, Wed - 11 October 23
  • Author singhj Updated - 10:39 AM, Wed - 11 October 23
ఇండియన్ గ్రౌండ్స్​పై బాబర్ సెటైర్స్! కట్ చేస్తే అట్టర్ ఫ్లాప్!

బాబర్ ఆజం.. బ్యాటర్​గా, పాకిస్థాన్ కెప్టెన్​గా అందరికీ సుపరిచితుడే. నిలకడగా ఆడుతూ తక్కువ టైమ్​లోనే టీమ్​ను లీడ్ చేసే స్థాయికి ఎదిగాడు బాబర్. ముఖ్యంగా వన్డే క్రికెట్​లో బాబర్ ఆజం కన్​సిస్టెంట్​గా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. దీంతో ప్రస్తుత తరంలో ఉన్న బెస్ట్ ప్లేయర్లతో బాబర్​ను పోల్చడం మొదలైంది. టీమిండియా స్టార్ బ్యాటర్​ విరాట్ కోహ్లీతో పాటు ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్ స్టీవ్ స్మిత్​తో బాబర్​ను కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు పాక్ ఫ్యాన్స్. వీళ్లిద్దరి కంటే బాబర్ బెస్ట్ బ్యాట్స్​మన్​ అని పలు సందర్భాల్లో పాక్ అభిమానులతో పాటు ఆ దేశ సీనియర్ క్రికెటర్లు కామెంట్స్ చేయడం గురించి న్యూస్​లో వింటూనే ఉన్నాం.

పాక్ సీనియర్లు, ఫ్యాన్స్ ఇస్తున్న బిల్డప్​​కు బాబర్ ఆజం ఆటకు ఏమాత్రం సంబంధం కనిపించడం లేదు. ఇటీవల జరిగిన ఆసియా కప్​లో బాబర్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. లంకతో పాటు పాక్ ఆతిథ్యం ఇచ్చిన ఆ టోర్నీలో అతడి ఫెయిల్యూర్​ జట్టుకు శాపంగా మారింది. ఆ టోర్నీలో స్వదేశీ పిచ్​ల పైనా అతడు రాణించలేకపోయాడు. అతడికి తోడు మిగిలిన వాళ్లూ సరిగ్గా ఆడకపోవడం, ఇంజ్యురీ కారణంగా ఒకరిద్దరు ప్లేయర్లు దూరం కావడంతో ఆసియా కప్​లో సూపర్-4 దశలోనే పాక్ వెనుదిరిగింది. ఆ టోర్నీలో భారత్​తో పాటు లంక చేతిలోనూ ఓటమిపాలైంది. అయితే వరల్డ్ కప్​లో మాత్రం మంచి స్టార్ట్ చేసింది పాకిస్థాన్.

ప్రపంచ కప్-2023లో ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచుల్లోనూ పాక్ గెలిచింది. పసికూన నెదర్లాండ్స్​తో పాటు శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్​లోనూ దాయాది జట్టు విజయం సాధించింది. అయితే ఈ రెండు మ్యాచుల్లోనూ పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఫెయిలయ్యాడు. రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి అతడు 15 రన్స్ చేశాడు. ఇందులో ఒక ఫోర్ మాత్రమే ఉంది. దీంతో భారత ఫ్యాన్స్, నెటిజన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. మెగా టోర్నీ ఆరంభానికి ముందు ఇండియన్ గ్రౌండ్స్​పై బాబర్ ఆజం చేసిన కామెంట్సే దీనికి కారణం. భారత మైదానాల్లోని బౌండరీలు చాలా చిన్నగా ఉంటాయని అతడు వ్యాఖ్యానించాడు.

ఇండియన్ గ్రౌండ్స్​ సైజ్ చిన్నగా ఉంటాయన్న బాబర్ ఆజం.. వరుసగా రెండు మ్యాచుల్లో ఫెయిలయ్యాడు. అంతేగాక ఈ రెండు మ్యాచుల్లో కలిపి కేవలం ఒకే బౌండరీ కొట్టాడు. దీంతో అతడిపై​ భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. మాటలు కాదు బాబర్.. దమ్ముంటే ఆడి చూపించాలని నెటిజన్స్ అతడికి సవాల్ విసురుతున్నారు. పాక్ కెప్టెన్ నోటిని అదుపులో పెట్టుకోవాలని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బాబర్.. వెల్​కమ్ టు ఇండియా, ఇక్కడ ఆడటం అంత ఈజీ కాదని నెటిజన్స్ అంటున్నారు. అయితే తన మీద వస్తున్న విమర్శలకు బాబర్ బ్యాట్​తో సమాధానం చెబుతాడా? లేదా మళ్లీ ఫెయిలై ట్రోలింగ్​కు గురవుతాడా? అనేది చూడాలి. మరి.. బాబర్ ఆజం పెర్ఫార్మెన్స్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: CWC 2023: మరోసారి చీటింగ్ చేసిన పాక్.. లంకతో మ్యాచ్​లోనూ రిపీట్!

 

View this post on Instagram

 

A post shared by Cricket Addictor (@cricaddictor)