iDreamPost

CWC 2023: మరోసారి చీటింగ్ చేసిన పాక్.. లంకతో మ్యాచ్​లోనూ రిపీట్!

  • Author singhj Published - 09:04 AM, Wed - 11 October 23
  • Author singhj Published - 09:04 AM, Wed - 11 October 23
CWC 2023: మరోసారి చీటింగ్ చేసిన పాక్.. లంకతో మ్యాచ్​లోనూ రిపీట్!

వన్డే వరల్డ్ కప్​-2023లో పాకిస్థాన్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. నెదర్లాండ్స్​తో తొలి మ్యాచ్​లో నెగ్గిన పాక్.. శ్రీలంకతో మంగళవారం జరిగిన రెండో మ్యాచ్​లోనూ గెలిచింది. భారీ టార్గెట్​ను ఛేజ్ చేసి కాన్ఫిడెన్స్​ను మరింత పెంచుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ మ్యాచ్​లోనూ పాకిస్థాన్​ చీటింగ్ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. నెదర్లాండ్స్​తో మ్యాచ్​లో చేసిన తప్పునే తిరిగి లంక పైనా కావాలనే రిపీట్ చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాక్-నెదర్లాండ్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్​లో ఓ ఘటన వివాదాస్పదంగా మారింది. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ టైమ్​లో పాక్ ఫీల్డర్ బౌండరీ లైన్​ను వెనక్కి నెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

నెదర్లాండ్స్ బ్యాటింగ్ టైమ్​లో ఓ 30 నిమిషాల పాటు బౌండరీ లైన్ మ్యాచ్ మొదలైనప్పటి కంటే కాస్త వెనక్కి ఉన్నట్లు న్యూస్ వచ్చింది. అయితే దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ చీటింగ్ చేసిందంటూ సీరియస్ అయ్యారు. అయితే ఆ ఘటన విషయంలో నిజంగానే పాకిస్థాన్ ఫీల్డర్ బౌండరీ లైన్​ను ఉద్దేశ పూర్వకంగా వెనక్కి నెట్టాడా? లేదా ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో బౌండరీని ఆపబోయి డైవ్ చేసిన క్రమంలో బౌండరీ లైన్ వెనక్కి జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇది జరిగి నాల్రోజులు కాలేదు.. మరో మ్యాచ్​లో సేమ్ సీన్ రిపీట్ అయింది. శ్రీలంకతో మంగళవారం పాక్ ఆడిన సమయంలోనూ బౌండరీ లైన్ కాస్త వెనక్కి జరిగినట్లు కనిపించింది.

లంక ఇన్నింగ్స్​ టైమ్​లో బౌండరీ లైన్ వెనక్కి జరిగి ఉన్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ పాక్ మరోమారు చీటింగ్ చేసిందని.. ఆ టీమ్ కావాలనే బౌండరీ లైన్​ను వెనక్కి నెట్టిందని విమర్శిస్తున్నారు. మ్యాచ్​లో ఓడిపోతామనే పాక్ ఇలాంటి కుయుక్తులు పన్నుతోందని ట్రోల్ చేస్తున్నారు. ఆ జట్టు బుద్ధి మార్చుకోకపోతే కష్టమని సీరియస్ అవుతున్నారు. అసలు పాక్ ఆడినప్పుడే, అందులోనూ ఆ టీమ్ ఫీల్డింగ్ టైమ్​లోనే ఎందుకిలా జరుగుతోందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

సాధారణంగా ఫీల్డర్లు బౌండరీ లైన్​లో ఫోర్లను ఆపే ప్రయత్నంలో ఫోర్ లైన్ కాస్త వెనక్కి జరిగినా.. గ్రౌండ్ స్టాఫ్ వెంటనే దాన్ని సరిచేస్తుంటారు. బౌండరీ లైన్ ఎలా ఉండాలో అలా సెట్ చేసేస్తారు. కానీ నెదర్లాండ్స్​తో మ్యాచ్​లో 30 నిమిషాల పాటు బౌండరీ లైన్ అలాగే వెనక్కి ఉంది. లంకతో మ్యాచ్​లోనూ బౌండరీ లైన్​ వెనక్కి జరిగినా మళ్లీ సరిచేయలేదు. పాక్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ బౌండరీ వివాదం చోటుచేసుకుంది. ఈ రెండు మ్యాచ్​లూ ఉప్పల్​లోనే జరిగాయి. ఈ నేపథ్యంలో ఇది పాక్ చేస్తున్న చీటింగా? లేదా గ్రౌండ్ స్టాఫ్ అలసత్వం కారణంగా జరుగుతోందా? అనేది క్లారిటీ లేదు. మరి.. పాక్ చీటింగ్​పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup: సెంచరీ కొట్టాక హాస్పిటల్​లో చేరిన స్టార్ క్రికెటర్!

 

View this post on Instagram

 

A post shared by Cricket Addictor (@cricaddictor)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి