iDreamPost

Singham Again: అదరగొట్టిన అర్జున్ కపూర్ ఫస్ట్ లుక్

  • Published Feb 14, 2024 | 12:10 PMUpdated Feb 14, 2024 | 12:10 PM

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో సింగం ఫ్రాంచైజ్ లో భాగంగా సింగం అగైన్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో సింగం ఫ్రాంచైజ్ లో భాగంగా సింగం అగైన్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 14, 2024 | 12:10 PMUpdated Feb 14, 2024 | 12:10 PM
Singham Again: అదరగొట్టిన అర్జున్ కపూర్ ఫస్ట్ లుక్

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో సింగం ఫ్రాంచైజ్ లో భాగంగా.. సింగం అగైన్ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అజయ్ తో పాటు కరీనా కపూర్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకునే, టైగర్ ష్రాఫ్ ఫస్ట్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. అందరి పాత్రల ఫస్ట్ లుక్స్ రివీల్ చేసిన రోహిత్ శెట్టి ఇప్పుడు ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న అర్జున్ కపూర్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.

ఈ పోస్టర్లో అర్జున్ రక్తసిక్తమైన కత్తి పట్టుకొని, కర్లీ హెయిర్, దట్టమైన గడ్డంతో కనిపిస్తున్నారు. రక్తంతో తడిసి, నలుపు రంగు దుస్తులు ధరించిన ఈ నటుడి భయానక చిరునవ్వు అతని ప్రతినాయక పాత్రకు బలమైన టోన్ సెట్ చేస్తుంది. మరో ఫోటోలో రణ్ వీర్ సింగ్ తో తలపడే విధానం చూస్తుంటే వారిద్దరి మధ్య ఇంటెన్స్ ఫైట్ ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. రోహిత్ శెట్టి అర్జున్ పాత్రను ‘షైతాన్’గా పరిచయం చేశారు. ” మనిషి తప్పు చేస్తాడు.. ఆ తప్పుకి శిక్ష కూడా అనుభవిస్తాడు.. కానీ ఇప్పుడు రాబోయేది సైతాన్” అంటూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో రాసుకొచ్చారు.

సింగం అగైన్ తో రోహిత్ శెట్టి తన పోలీస్ యూనివర్స్ లో కొత్త పాత్రలను కూడా ప్రవేశ పెట్టారు. శక్తి శెట్టిగా దీపికా పదుకొణె, ఏసీపీ సత్యగా టైగర్ ష్రాఫ్, పైన చెప్పుకున్నట్టు ప్రతినాయకుడిగా అర్జున్ కపూర్ వంటి కొత్త పాత్రలను పరిచయం చేశారు. అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ వరుసగా సింగం, సూర్యవంశీ, సింబా పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ విషయానికి వస్తే ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 తో పోటీ పడనుందని సమాచారం. బాలీవుడ్ ఇండస్త్ట్రీ తో పాటు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి