iDreamPost

గుండెపోటుతో కాదు కరోనాతోనే రిజిస్ట్రార్‌ మరణం.. 28 వరకూ హైకోర్టుకు సెలవు

గుండెపోటుతో కాదు కరోనాతోనే రిజిస్ట్రార్‌ మరణం.. 28 వరకూ హైకోర్టుకు సెలవు

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రిజిస్ట్రార్‌ మరణంలో కొత్త విషయం వెలుగుచూసింది. బుధవారం రిజిస్ట్రార్‌ రాజశేఖర్‌ ఆకస్మికంగా మరణించారు. ఆయనకు గుండెపోటు రావడంతో చనిపోయారని అధికారులు తెలిపారు. అయితే ఈ రోజు మృతదేహానికి స్వాబ్ టెస్ట్‌ చేయగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఒక్కసారిగా హైకోర్టులో కలకలం రేగింది. ఈ పరిణామాల నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28వ తేదీ వరకూ హైకోర్టుకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు నూతన రిజిస్ట్రార్‌ సెలవు విషయంపై సర్కూలర్‌ జారీ చేశారు.

హైకోర్టుతోపాటు విజయవాడలోని మెట్రో పాలిటన్‌ సెసెన్స్‌ జడ్జి యూనిట్‌ కార్యకలాపాలు కూడా ఈ నెల 28వ తేదీ వరకూ నిలిపివేస్తున్న హైకోర్టు రిజిస్ట్రార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి