iDreamPost

రాజధాని పిటిషన్లని వాయిదా వేసిన హై కోర్ట్

రాజధాని పిటిషన్లని వాయిదా వేసిన హై కోర్ట్

రాజధానికి సంభందించిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు, కర్నూల్ కి హైకోర్టు కి సంబందించిన కార్యాలయాల తరలింపు అంశాలపై దాఖలైన పిటిషన్ల పై తదుపరి విచారణను హై కోర్ట్ మార్చి 30 వ తేదికి వాయిదా వేసింది. బుధవారం ఈ పిటిషన్ల పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం జియన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీల నివేదికను కోర్ట్ కి సమర్పించాలని ఆదేశించింది.

ఇక రాజధాని లో ప్రభుత్వం ఇళ్లస్థలాల కేటాయింపు పై దాఖలైన పిటిషన్ పై ఈ రోజు మధ్యాహ్నం 2:30 తరువాత విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. రాజధాని నిర్మాణానికి రైతులనుండి సేకరించిన భూమిలో 1251 ఎకరాల్ని ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు ఇళ్లస్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో నెంబర్-107 ను జారీచేసింది. ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు’ పధకం కింద 1251 ఎకరాల్లో 54,307 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించనున్నట్టు ఈ జీవో లో ప్రభుత్వం పేర్కొంది. రాజధాని సమీపంలోని మంగళగిరి, తాడేపల్లి, పెదకాకాని మండలాలతో పాటు సమీపంలోని విజయవాడ నగరపాలక సంస్ధకు చెందిన పేద ప్రజలకు ఈ ఇళ్లస్థలాలు కేటాయించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

భూ సమీకరణలో తీసుకున్న మొత్తం భూమిలో 5 శాతం పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలో 53 (డి) నిబంధన చెబుతుందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె.శ్యామల రావు పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాజధాని ప్రాంతానికి చెందిన పలువురు రైతులు హైకోర్టుని ఆశ్రయించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి