iDreamPost

ఇంగ్లీష్ మీడియం వద్దన్న ప్రతిపక్షాలకు చెంపపెట్టు.. UNO సదస్సుకు AP విద్యార్థులు

ఇంగ్లీష్ మీడియం వద్దన్న ప్రతిపక్షాలకు చెంపపెట్టు.. UNO సదస్సుకు AP విద్యార్థులు

పేదరికం పోవాలంటే కేవలం చదువు ఒక్కటే మార్గమని చెప్పిన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కనీవినీ ఎరుగని రీతిలో విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించడానికి వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టారు సీఎం జగన్. మనబడి నాడు.. నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చి ఆధునిక పద్దతుల్లో బోధన జరిగే విధంగా వసతులు కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం నేడు ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఐక్యరాజ్య సమితి సదస్సుకు ఎంపికయ్యేలా చేసింది. దేశంలోనే తొలిసారిగా యూఎన్ ఓ సదస్సుకు ఎంపికైన వారిగా ఏపీ విద్యార్థులు రికార్డు సృష్టించారు.

ప్రపంచంలో చోటుచేసుకుంటున్న మార్పులు, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పుల దృష్ట్యా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భవిష్యత్ లో ఏ విధమైన ఆటంకం కలగకుండా ఉండేందుకు సీఎం జగన్ దీర్ఘ దృష్టితో ఆలోచించి ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఇక దీనిపై ప్రతిపక్షాలు అరిచి గగ్గోలు పెట్టాయి. మాతృభాష తెలుగుకు అన్యాయం చేస్తున్నారని, విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో రాణించలేరని, విద్యార్థులకు నష్టం జరుగుతుందని విమర్శించారు. కానీ నేడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల వస్తున్న ఫలితాలు ప్రతిపక్షాలకు లాగిపెట్టికొట్టినట్లుగా సరైన గుణపాఠం చెబుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వద్దంటూ నానా రచ్చ చేసిన ప్రతి పక్షాలు.. కానీ నేడు అదే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు యూఎన్ వేదికపై ఏపీ విద్యావ్యవస్థ గురించి ఇంగ్లీష్ లో ప్రసంగించనున్నారు. ఈ ఘనత ప్రతిపక్షాలకు చెంపపెట్టులా మారింది.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 10 మంది విద్యార్థులు ఐక్యరాజ్య సమితి ఈ నెల 16 నుంచి నిర్వహించే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సదస్సుకు ఎంపికయ్యారు. వీరిలో 8 మంది బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో అడుగుపెట్టడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. విద్యార్థి బృందం గురువారం హైదరాబాద్‌ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌ నగరానికి బయలుదేరింది.

ఏపీ విద్యా సంస్కరణలపై యూఎన్ఓలో ప్రదర్శన

రాష్ట్ర విద్యావ్యవస్థలో నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ట్యాబ్లెట్‌ల పంపిణీ, డిజిటల్‌ తరగతి గదులు, ఆంగ్ల విద్య, పాఠ్యాంశాల సంస్కరణలు, సబ్జెక్టు ఉపాధ్యాయుల నియామకంతో పాటు విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ఏపీ విద్యార్థుల బృందం ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శిన ఇవ్వనుంది.

ఐక్యరాజ్య సమితి సదస్సుకు ఎంపికైన విద్యార్థులు వీరే:

1. మాల శివలింగమ్మ, కేజీబీవీ ఆదోని, కర్నూలు జిల్లా
2. మోతుకూరి చంద్రలేఖ, కేజీబీవీ ఎటపాక, ఏఎస్‌ఆర్‌ జిల్లా
3. గుండుమోగుల గణేష్‌ అంజనాసాయి, ఏపీఆర్‌ఐఎస్, అప్పలరాజుగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా
4. దడాల జ్యోత్స్న, సాంఘిక సంక్షేమ పాఠశాల, వెంకటాపురం, కాకినాడ జిల్లా
5. సి.రాజేశ్వరి, ఏపీ మోడల్‌ స్కూల్, నంద్యాల
6. పసుపులేటి గాయత్రి, జెడ్పీహెచ్‌ఎస్‌ వట్లూరు, ఏలూరు జిల్లా
7. అల్లం రిషితారెడ్డి, మునిసిపల్‌ ఉన్నత పాఠశాల, కస్పా, విజయనగరం జిల్లా
8. వంజివాకు యోగేశ్వర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చంద్రగిరి, తిరుపతి జిల్లా
9. షేక్‌ అమ్మాజన్, ఏపీఆర్‌ఎస్, వేంపల్లి, శ్రీ సత్యసాయి జిల్లా
10. సామల మనస్విని, కేజీబీవీ, జీఎల్‌ పురం, పార్వతీపురం మన్యం జిల్లా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి