iDreamPost

కడప ఉక్కు పరిశ్రమకు 3148.68 ఎకరాలు కేటాయించిన ఏ.పి సర్కార్

కడప ఉక్కు పరిశ్రమకు  3148.68 ఎకరాలు కేటాయించిన ఏ.పి సర్కార్

రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు వడి వడిగా అడుగులు పడుతున్నాయి. విభజన చట్టంలో హామీ గా ఆంద్రప్రదేశ్ కు ఇచ్చిన కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి కేంద్రం నుండి ఎలాంటి సానుకూల నిర్ణయం రాకపొయినా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జగన్ ప్రభుత్వం శంఖుస్తాపన తేది కూడా డిసెంబర్ 26గా ఖరారు చేసింది. సుమారు 20వేల మంది నిరుద్యోగులకు శాశ్వత ఉద్యోగాలు, 50వేల మందికి పరోక్ష ఉపాధి కల్పన ఈ ఉక్కు పరిశ్రమ ద్వారా కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసింది.

అయితే తాజాగా ఈ ఉక్కు పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం జమ్మలమడుగు మండలం పెద్దగండ్లూరు, సున్నపురాళ్ల పల్లి గ్రామాల్లో 3148.68 ఎకరాల ప్రభుత్వ భూమిని ముందస్తుగా ఉక్కు పరిశ్రమకు అప్పగించాలని రెవెన్యు శాఖ విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. దీంతో ఉక్కు పరిశ్ర స్థాపనకు మరో ముందడుగు పడినట్టుగా భావిస్తున్నారు. జగన్ ప్రభుత్వం చెప్తునట్టు ఈ ఉక్కు పరిశ్రమ మూడేళ్ళలో పూర్తి అయితే రాయలసీమ యువత ఎదుర్కుంటున్న నిరుద్యోగ సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి