iDreamPost

MS Dhoni: ధోని పరువు తీసిన పంజాబ్‌ కింగ్స్‌! పగవాడికి కూడా ఈ కష్టం రావొద్దు.. పోస్ట్ వైరల్!

ధోని పరువు తీసేలా పంజాబ్ కింగ్స్ ఓ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో.. ఈ కష్టం పగవాడికి కూడా రావొద్దు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముంది?

ధోని పరువు తీసేలా పంజాబ్ కింగ్స్ ఓ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో.. ఈ కష్టం పగవాడికి కూడా రావొద్దు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముంది?

MS Dhoni: ధోని పరువు తీసిన పంజాబ్‌ కింగ్స్‌! పగవాడికి కూడా ఈ కష్టం రావొద్దు.. పోస్ట్ వైరల్!

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో చిత్తైన సంగతి తెలిసిందే. చెన్నై నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్ ను 3 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలో కొట్టేసింది. ఇక ఈ మ్యాచ్ లో ధోని తన దూకుడైన ఆటతీరుకు భిన్నంగా బ్యాటింగ్ చేయడమే కాకుండా.. డార్లీ మిచెల్ కు స్ట్రైకింగ్ ఇవ్వకుండా విమర్శల పాలైయ్యాడు. మరీ ముఖ్యంగా డార్లీ మిచెల్ వ్యవహారంలో ధోనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ధోని పరువు తీసేలా పంజాబ్ కింగ్స్ ఓ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో.. ఈ కష్టం పగవాడికి కూడా రావొద్దు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే?

ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ పడుతూ.. లేస్తూ.. ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ ల్లో సగం గెలిచి.. సగం ఓడిపోయింది. తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయి ప్లే ఆఫ్స్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ధోని చేసిన పనికి ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. ఫ్యాన్స్ తో పాటుగా నెటిజన్లు కూడా ధోనిపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డార్లీ మిచెల్ క్రిజ్ వరకు వచ్చినాగానీ రన్ కు వెళ్లకుండా.. అతడిని వెనక్కి తిరిగి పంపించడంపై సోషల్ మీడియా వేదికగా ధోని సెల్ఫిష్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ధోని పరువు తీసేలా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది పంజాబ్ కింగ్స్ యాజమాన్యం. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ గెలిచిన అనంతరం టీమ్స్ పాయింట్ల పట్టిక ఫొటోను షేర్ చేస్తూ.. తాము పాయింట్ల పట్టికలో ఈ పొజిషన్ లో ఉంటడానికి కారణం ‘తలా’ అంటూ ధోని పేరును మెన్షన్ చేసింది. పంజాబ్ 10 మ్యాచ్ ల్లో 4 విజయాలు 6 అపజయాలతో ప్రస్తుతం 7వ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక ఈ మ్యాచ్ లో ధోని 11 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసి చివరి ఓవర్లో రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. అయితే ఎప్పుడూ కూడా తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేసే ధోని.. ఈసారి ఏకంగా 11 బంతులు ఎదుర్కొని కేవలం 14 రన్స్ చేయడంతోనే తాము గెలిచామని ఇన్ డైరెక్ట్ గా ధోనిపై సెటైర్లు వేస్తూ.. ఆ పోస్ట్ ను షేర్ చేసింది పంజాబ్. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఈ కష్టం పగవాడికి కూడా రావొద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ధోని పరువు తీసేలా పోస్ట్ షేర్ చేసిన పంజాబ్ టీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి