iDreamPost

ముంబైతో పాటు మరో రెండు ఫ్రాంచైజీలను ముంచేసిన హార్దిక్.. బ్యాడ్ లక్ అంటే ఇదే!

  • Published May 02, 2024 | 5:15 PMUpdated May 02, 2024 | 5:15 PM

ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా వల్ల సొంత జట్టుతో పాటు మరో రెండు ఫ్రాంచైజీలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఆ టీమ్స్​ను బ్యాడ్ లక్ వదలడం లేదు.

ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా వల్ల సొంత జట్టుతో పాటు మరో రెండు ఫ్రాంచైజీలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఆ టీమ్స్​ను బ్యాడ్ లక్ వదలడం లేదు.

  • Published May 02, 2024 | 5:15 PMUpdated May 02, 2024 | 5:15 PM
ముంబైతో పాటు మరో రెండు ఫ్రాంచైజీలను ముంచేసిన హార్దిక్.. బ్యాడ్ లక్ అంటే ఇదే!

ముంబై ఇండియన్స్.. ఈ పేరు చెబితేనే ఐపీఎల్​ ఫ్రాంచైజీలన్నీ భయపడతాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 5 సార్లు క్యాష్ రిచ్ లీగ్​లో ఛాంపియన్స్​గా నిలిచిన టీమ్ ఇది. ముంబై ప్లేఆఫ్స్​కు వెళ్తే ఇతర జట్లు కప్పు మీద ఆశలు వదిలేసుకుంటాయి. ఎందుకంటే ఓటమి కోరల్లో నుంచి కూడా గెలవడం ఎలాగో తెలిసిన టీమ్ అది, ప్రెజర్ సిచ్యువేషన్స్​ను తట్టుకొని నిలబడటం నేర్చుకున్న జట్టు. ఇంత ఘన చరిత్ర ఉన్న ఎంఐ ఈసారి కూడా ఫేవరెట్స్​గానే బరిలోకి దిగింది. కానీ అనూహ్యంగా వరుస ఓటములతో ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప ముంబై ప్లేఆఫ్స్​కు వెళ్లడం దాదాపుగా అసాధ్యమే. ఆ టీమ్ ఫెయిల్యూర్​కు ఆటగాళ్లందరి కంటే కూడా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే మెయిన్ రీజన్ అని చెప్పాలి. అయితే ఎంఐనే కాదు.. మరో రెండు ఫ్రాంచైజీలనూ ముంచేశాడు పాండ్యా.

ఈ సీజన్​లో బ్యాటర్​గా, బౌలర్​గా ఫెయిలైన హార్దిక్.. కెప్టెన్​గానూ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అతడి చెత్త డిసిషన్స్ ముంబై ఓటమికి కారణాలుగా మారాయి. ఎంఐతో పాటు మరో రెండు జట్లు మునగడానికి కూడా అతడే రీజన్. కాగా, రోహిత్ శర్మకు వయసు మీద పడుతుండటం, వన్డే వరల్డ్ కప్​-2023ను భారత్​కు అందించడంలో అతడు ఫెయిలవడం, గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్​లో ఎంఐ వైఫల్యం, సారథిగా, ఆటగాడిగానూ హిట్​మ్యాన్ ఆకట్టుకోకపోవడంతో ఈ సీజన్​కు అతడ్ని కెప్టెన్సీ నుంచి తొలగించింది ముంబై. రోహిత్ ప్లేస్​లో ఏరికోరి హార్దిక్ పాండ్యాను తెచ్చుకుంది. గుజరాత్ టైటాన్స్​కు కెప్టెన్​గా ఉన్నోడ్ని తీసుకొని తమ ఫ్రాంచైజీకి సారథిగా చేసింది ఎంఐ మేనేజ్​మెంట్. హార్దిక్ కోసం స్టార్ ఆల్​రౌండర్ కామెరాన్ గ్రీన్​ను వదులకుంది. అతడ్ని ఆర్సీబీకి ఇచ్చేసింది. తద్వారా వచ్చిన డబ్బుల్ని గుజరాత్​కు చెల్లించి పాండ్యాను సొంతం చేసుకుంది ముంబై. ఇలా పాండ్యా విషయంలో మూడు ఫ్రాంచైజీలు కీలకంగా వ్యవహరించాయి.

Hardik Pandya

పాండ్యా ముంబైకి మారడంలో ఆర్సీబీ హెల్ప్ చేసింది. అతడు వెళ్లిపోతానంటే గుజరాత్ యాజమాన్యం అడ్డుకోలేదు. తద్వారా అతడి ట్రేడింగ్​కు రూట్ క్లియర్ అయింది. అయితే ఈ మూడు ఫ్రాంచైజీలు ఇప్పుడు మునిగిపోయాయి. హార్దిక్ వస్తే రాత మారుతుందని అనుకున్న ఎంఐ.. ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్ రేసు నుంచి టెక్నికల్​గా తప్పుకుంది. ముంబై నుంచి గ్రీన్​ను తెచ్చుకొని పాండ్యా ట్రేడింగ్​కు కావాల్సిన మొత్తాన్ని సమకూర్చిన బెంగళూరు పాయింట్స్ టేబుల్​లో కింది నుంచి ఫస్ట్ ప్లేస్​లో ఉంది. ఆ టీమ్ కూడా ప్లేఆఫ్స్ రేసులో లేదు. హార్దిక్ వెళ్తే ఆపకుండా వెళ్లిపొమ్మని చెప్పిన గుజరాత్ 10 మ్యాచుల్లో 4 విజయాలు, 6 ఓటములతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆ జట్టు ప్లేఆఫ్స్ ఆశలు మిణుకుమిణుకుమంటున్నాయి. దీంతో బ్యాడ్ లక్ అంటే ఈ టీమ్స్​దేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పాండ్యా వల్ల మూడు జట్లు మునిగాయని చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Epic Cricket Comments (@epic.cricket_comments)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి