iDreamPost

రాయలసీమలో చంద్రబాబు కూటమికి సరుకు లేదా?

మరికొద్ది నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జనసేన, టీడీపీ కూటమి పొత్తులతో ఎన్నికల్లో పోటీ చేయనుండగా అధికార వైసీపీ మాత్రం సింగిల్ గానే బరిలో దిగనుంది. ఈ నేపథ్యంలనే ఇరు పార్టీలు రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించాయి.

మరికొద్ది నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జనసేన, టీడీపీ కూటమి పొత్తులతో ఎన్నికల్లో పోటీ చేయనుండగా అధికార వైసీపీ మాత్రం సింగిల్ గానే బరిలో దిగనుంది. ఈ నేపథ్యంలనే ఇరు పార్టీలు రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించాయి.

రాయలసీమలో చంద్రబాబు కూటమికి సరుకు లేదా?

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ,జనసేనాలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే నియోజకవర్గాల ఇన్ ఛార్జీల విషయంలో మార్పులు చేర్పులు చేశారు. ఇప్పటికే మూడు విడతలుగా నియోజకవర్గాల ఇన్ చార్జీలను వైసీపీ ప్రకటించింది. ఇలా వ్యూహాలు, ప్రతి వ్యూహాలు సాగుతున్న సమయంలో వైసీపీ గట్టి పట్టున్న రాయలసీమలో టీడీపీ బలం కోల్పోయిందనే వార్తలు వినిపిస్తోన్నాయి.

ఏపీ రాజకీయాల్లో రాయలసీమది ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక్కడి నుంచి ఎక్కువ మంది రాష్ట్రానికి ముఖ్యమంత్రులు వచ్చారు. అయితే ఇక్కడ మొదటి నుంచి కూడా విభిన్నమైన తీర్పులు వస్తుంటాయి. ఇక్కడ ప్రస్తుతం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య గట్టి ఫైట్ నడుస్తోందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీ చాలా బలంగా ఉందన్న విషయం ప్రతి ఒక్కరి తెలిసిందే. అందుకే రాయలసీమలో  తమ పట్టు నిలుపుకునేందుకు టీడీపీ, జనసేన కలిసి ముందుకెళ్తున్నాయి. అయినా  చంద్రబాబుకు కూటమికి సరకు లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమలో 52 స్థానాలకు గాను కేవలం 3 స్థానాలో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. మిగిలిన అన్ని స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగింది. గ్రామస్థాయిలో టీడీపీ బలహీన పడగా.. వైఎస్సార్ సీపీ బలం పెరిగింది. ఇక వచ్చే ఎన్నికల్లో ఆ అధికార పార్టీ ఓడిపోయినా మూడు స్థానాల్లో కూడా విజయం సాధించాలని ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. కుప్పం, హిందుపూర్, ఉరవకొండలో టీడీపీ గెలిచింది. ఇక్కడ వైసీపీ జెండా ఎగరేసేందుకు అధినాయకత్వం ప్లాన్లు రచిస్తోంది. ఇదే సమయంలో రాయలసీమలో చాలా స్థానాలో టీడీపీ,జనసేన కూటమిలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. అంతేకాక కొన్ని చోట్ల అయితే అభ్యర్థులే ఆ పార్టీలకు కరువయ్యారు.

అంతేకాక కర్నూలు, కడప, వంటి జిల్లాలో వైసీపీకి పూర్తి స్థాయిలో పట్టు ఉంది. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ విజయం సాధించిన.. రాయలసీమలో మాత్రం వైసీపీ హవానే కొనసాగింది. ఇప్పుడు సింగిల్ గా, తాజాగా కూటమితో వెళ్తున్న కూడా రాయలసీమలో టీడీపీ బలం లేదనే వార్తలు వినిపిస్తోన్నాయి.  ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన కూడా ఫలితం కనిపించడం లేదు. అంతేకాక ప్రభుత్వంపై టీడీపీ ఊహించుకున్న స్థాయిలో రాయలసీమలో వ్యతిరేకత లేదనేది పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోన్నాయి. అంతేకాక కోస్తాంధ్రాలో కంటే రాయలసీమలో ఈ కూటమి చాలా బలహీనంగా ఉంది. ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ హవానే  సీమలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి..రాయలసీమలో చంద్రబాబు కూటమికి సరకు లేదంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి