iDreamPost

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై సామాన్యుడు పోటీ! ఎవరీ శ్యామ్ రంగీలా?

  • Published May 02, 2024 | 5:36 PMUpdated May 02, 2024 | 5:36 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ నేతలతో పాటు, సినీ, క్రీడా రంగాలకు చెందిన వ్యక్తులు కూడా పోటిలో దిగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు ఓ కమెడియన్ ప్రధాన నరేంద్ర మోడీకి పోటీగా ఎన్నికల్లో దిగుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ నేతలతో పాటు, సినీ, క్రీడా రంగాలకు చెందిన వ్యక్తులు కూడా పోటిలో దిగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు ఓ కమెడియన్ ప్రధాన నరేంద్ర మోడీకి పోటీగా ఎన్నికల్లో దిగుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే..

  • Published May 02, 2024 | 5:36 PMUpdated May 02, 2024 | 5:36 PM
వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై సామాన్యుడు పోటీ! ఎవరీ శ్యామ్ రంగీలా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో రాజకీయ నాయకులే కాకుండా.. ఎంతో మంది సినీ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీస్ కూడా పోటీ చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో కొందరు రకరకాల పార్టీల నుంచి బరిలోకి దిగుతుండగా.. మరికొందరు మాత్రం ఇండిపెండెంట్ గా ఎన్నికల్లో పోటీకు తలపడుతున్నారు. ఈ క్రమంలోనే సామాన్య వ్యక్తులు కూడా పెద్ద పెద్ద నేతకు పోటీగా వాళ్ల నియోజకవర్గంలో పోటీ చస్తూ అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటున్నారు. అయితే తాజాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయిన వ్యక్తి కూడా అలాంటి కోవకు చెందినవాడు. ఈయన ఒక కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ కావడం విశేషం. అయితే ఇతను ప్రధానమంత్రి మోడీకు పోటిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. ఇంతకీ ఆయన ఎవరంటే..

ఇప్పుడు ఎక్కడ చూసిన ఎన్నికల హడవిడి అనేది జోరుగా కొనసాగుతుంది. కాగా, ఈ ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ నేతలతో పాటు, సినీ, క్రీడా రంగాలకు చెందిన వ్యక్తులు కూడా పోటిలో దిగుతున్నారు. ఇప్పటికే చాలామంది తమ నియోజకవర్గంలో పార్టీ తరుపున ప్రచారం చేస్తూ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ కుడా ఎన్నికల్లో పోటికి దిగుతుండటం విశేషం. అయితే 30 ఏళ్ల వయసున్న శ్యామ్ రంగీలా అనే కామెడీన్.. గత 10 ఏళ్లుగా దేశనికి ప్రధానమంత్రిగా పనిచేస్తూ.. వారణాసి నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన నరేంద్ర మోడి పై పోటీకి దిగుతున్నాడు. కాగా, ఎన్నికల్లో పోటీ చేయడం, మరీ ముఖ్యంగా ప్రధానిపై బరిలోకి దిగడానికి ప్రత్యేక కారణం కూడా ఉందని శ్యామ్ రంగీలా ప్రకటించారు. ఇక వారణాసి నియోజకవర్గ ప్రజలకు తాను ఒక ప్రత్యామ్నాయం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే, సూరత్, ఇండోర్ వంటి నియోజకవర్గాల మాదిరిగా వారణాసిలో కూడా ఎన్నికలు జరగకుండానే ఏకగ్రీవం కావడం తనకు ఇష్టం లేదని, అందుకే తాను మోదీకి వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నారు. ఇక సూరత్‌ నియోజకవర్గంలో ముఖేష్ దలాల్, ఇండోర్ నియోజకవర్గం నుంచి శంకర్ లాల్వానీ, ఎన్నికలు జరగకుండానే పోటీలో ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే వీరిద్దరు నేతలు బీజేపీకి చెందిన వారు కావడం గమనార్హం. అందుకే తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపాడు.

అయితే ఎన్నికల్లో పాల్గొంటున్న శ్యామ్ రంగీలా విషయానికొస్తే.. ఈయన రాజస్థాన్‌లోని హనుమాన్‌గర్హ్ జిల్లాలోని మనక్‌తేరీ బరనీ గ్రామంలో 1994 లో జన్మించారు.  అయితే శ్యామ్ రంగీలా అసలు పేరు శ్యామ సుందర్. కాగా, గతంలో యానిమేషన్ కోర్సు చేసిన శ్యామ్ రంగీలా.. తనకు ఇష్టమైన కామెడీ, మిమిక్రీ, స్టాండప్ కామెడీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.  ఆ తర్వాత.. 2017 లో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ అనే వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాయిస్‌ మిమిక్రీ చేయడంతో శ్యామ్ రంగీలాకు మంచి ఫేమ్ వచ్చింది. ఇక ఆ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. శ్యామ్ రంగీలా ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. అంతేకాకుండా.. ఈయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాయిస్ ను కూడా మిమిక్రీ చేస్తారు. ఇదిలా ఉంటే.. శ్యామ్ రంగీలా 2022లో  శ్యామ్ రంగీలా రాజస్థాన్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. కాగా, ఆ పార్టీలో చేరడానికి ముందు శ్యామ్ రంగీలా కొన్ని పోస్టులను చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీకి ట్యాగ్ చేశారు.

అంతేకాకుండా.. ప్రజలు ప్రధానికి భయపడుతున్నారని.. అందుకే తాను టీవీ షోలకు వెళ్లేకపోయనని శ్యామ్ తెలిపారు. అలాగే ప్రధాని మోడీ వాయిస్ ను మిమిక్రీ చేయడం నేరమా అంటూ ప్రశ్నించారు. అయితే తాను 2014 సార్వత్రిక ఎన్నికల్లో తాను నరేంద్ర మోదీకి, బీజేపీకి మద్దతు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఇకపోతే గత 10 ఏళ్లుగా రాజకీయ నాయకులు చేస్తున్న చేష్టల కారణంగా అసహనం పెరిగి.. తన మనసు మార్చుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టేలా చేసిందని వెల్లడించారు.  మరి, ప్రధానమంత్రికి పోటీగా శ్యామ్ రంగీలా వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేయండం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి