iDreamPost

నన్ను సెక్సువల్‌గా హింసించాడు..ఆ తర్వాత కాళ్లు పట్టుకున్నాడు: నటి

ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక దాడులు, వేధింపులు గురించి ఇప్పుడిప్పుడే బహిరంగంగా బయటకు వచ్చి చెబుతున్నారు. గతంలో నటి కుష్బు తన సొంత తండ్రే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిపింది. ఇప్పుడు మరో నటి

ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక దాడులు, వేధింపులు గురించి ఇప్పుడిప్పుడే బహిరంగంగా బయటకు వచ్చి చెబుతున్నారు. గతంలో నటి కుష్బు తన సొంత తండ్రే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిపింది. ఇప్పుడు మరో నటి

నన్ను సెక్సువల్‌గా హింసించాడు..ఆ తర్వాత కాళ్లు పట్టుకున్నాడు: నటి

ఆడవాళ్లకు బయటే కాదు ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోయింది. ఎన్ని చట్టాలు తెచ్చినా.. నిందితులకు చుట్టాలుగా మారిపోతున్నాయి తప్ప.. మహిళలకు మాత్రం సరైన న్యాయం జరగడం లేదు. పని ప్రదేశాల్లో, ప్రయాణీల్లోనే కాదు.. ఇంట్లో బంధువుల వెకిలీ చూపులు, చేష్టలకు కూడా బలౌతున్నారు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఈ లైంగిక వేధింపులకు ఎప్పుడో ఓ సమయంలో ఎదుర్కొన్న వాళ్లే. అయితే కొంత మంది నటీమణులు ఇప్పుడిప్పుడే బహిరంగంగా వ్యక్తం చేయగలుతున్నారు. గతంలో నటి కుష్బు..ఎనిమిదేళ్ల ప్రాయంలో తన తండ్రి చేతిలోనే లైంగిక వేధింపులకు గురయ్యానంటూ సంచలన కామెంట్స్ చేసిన సంగతి విదితమే. ఇప్పుడు మరో నటి ఇదే రకమైన ఆరోపణలు చేస్తోంది.

బాలీవుడ్ ప్రముఖ టీవీ, సినీ నటి మణినీ దే.. తాను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినేనని వెల్లడించింది. తన చిన్నతనంలో ఎదుర్కొన్న ఓ భయంకరమైన చేదు అనుభవాన్ని ధైర్యంగా వ్యక్త పరిచింది. ‘ఏడేళ్ల వయస్సులో.. మా దగ్గరి బంధువు ఒకరు నన్ను సెక్సువల్‌గా వేధించాడు. అది నా జీవితంలో చీకటి దశ. ఆ సంఘటన నన్ను, నా మనస్సును ఎంతో గాయం చేసింది. ఆ గాయం ఎన్నటికీ మాయనిది. ఆ తర్వాత నా చదువుపై శ్రద్ద పెట్టా. కానీ నా జీవితంపై చాలా ఇంపాక్ట్ చూపింది’ అని వెల్లడించింది. అయితే ఈ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పలేదా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చింది ఈ నటి. అప్పట్లో చెప్పేందుకు చాలా భయపడ్డానని, ఆ సంఘటన జరిగిన చాన్నాళ్ల తర్వాత చెప్పినట్లు తెలిపింది.

కానీ కర్మ ఊరికనే వదిలి పెట్టదు కదా.. ఐదేళ్ల క్రితం ఓ ఫంక్షన్‌లో తనపై లైంగిక దాడికి పాల్పడిన అదే బంధువు తన ఎదుట పడి.. క్షమించమని, క్షమాపణలు కోరాడని, తాను పట్టించుకోలేదని తెలిపింది మణి. అయితే ఇలాంటి వేధింపులు ఎదురైతే.. తనకు చెప్పాలని తన కూతురికి చెప్పినట్లు తెలిపింది నటి. మణి 1995 నుండి టీవీ రంగంలో కొనసాగుతుంది. కానీ ఆమెకు గుర్తింపు తెచ్చిన ధారావాహిక జెస్సీ జెస్సీ కోయి నహిన్. ఆమె నాగిన్, సీఐడీ వంటి సీరియల్స్‌లో కూడా కనిపించింది. అలాగే 2003లో వచ్చిన ఓ మూవీతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆమె.. క్రిష్ మూవీలో ప్రియాంక చోప్రా స్నేహితురాలి పాత్రలో కనిపించింది. ప్యాషన్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. అంతే కాదు.. రాజా దిగ్రేట్ రాధిక పాత్రకు, సరిలేరు నీ కెవ్వరూ విజయ శాంతి హిందీ డబ్బింగ్ చెప్పింది ఈ నటినే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి