iDreamPost

GHMC మేయర్‌ విజయలక్ష్మి ఇంట్లో చొరబడిన రౌడీషీటర్‌! ఏకంగా..

Gadwal Vijayalakshmi: లోక్‌సభ ఎన్నికల వేళ బంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో సంచలనం చోటుచేసుకుంది. పట్టపగలే యూసఫ్‌గూడకు చెందిన రౌడీ షీటర్ ..మేయర్ ఇంటివద్ద హల్‌చల్ సృష్టించాడు.

Gadwal Vijayalakshmi: లోక్‌సభ ఎన్నికల వేళ బంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో సంచలనం చోటుచేసుకుంది. పట్టపగలే యూసఫ్‌గూడకు చెందిన రౌడీ షీటర్ ..మేయర్ ఇంటివద్ద హల్‌చల్ సృష్టించాడు.

GHMC మేయర్‌ విజయలక్ష్మి ఇంట్లో చొరబడిన రౌడీషీటర్‌! ఏకంగా..

ప్రముఖల ఇళ్లకు ఎంతో బందోబస్తు ఉంటుంది.  నిత్యం వారి ఇంటి చుట్టు భారీ భద్రత ఉంటుంది. గుర్తు తెలియన వారు ఎవరు వచ్చిన పూర్తిగా విచారణ చేసి..మాత్రమే లోపలికి అనుమతిస్తుంటారు. ఇలా సినీ, రాజకీయ ప్రముఖల ఇళ్ల వద్ద ఉండే భద్రత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినా తరచూ గుర్తు తెలియని వ్యక్తులు ప్రముఖల ఇళ్ల ముంద రచ్చ చేసిన ఘటనలు జరిగాయి. తాజాగా హైదారాబాద్ మేయర్ ఇంట్లోకి రౌడీ షీటర్ చొరబడి నానాహంగామా సృష్టించాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ నగర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంట్లోకి ఓ రౌడీ షీటర్ చొరబడటం తీవ్ర కలకలం సృష్టించింది. ఆ వ్యక్తి ఇంట్లో చొరబడటమే కాకుండా నేరు మేయర్ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు  మేయర్ ఇంటికి వెళ్లి రౌడీ షీటర్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడకు చెందిన రౌడీ షీటర్‌ లక్ష్మణ్‌ మంగళవారం మేయర్‌ విజయలక్ష్మి ఇంట్లోకి వెళ్లాడు.

అతడు విజయలక్ష్మి ఇంటికి వెళ్లడమే కాకుండా ఏకంగా ఆమె ఉండే పర్సనల్ రూమ్ లోకి వెళ్లేందుకు ప్రయ్నతించాడు. వెంటనే అప్రమత్తమైన మేయర్ సిబ్బంది అతడిని అడుగున్నారు. ఇంట్లోకి చొరబడిన క్రమంలో సిబ్బంది వారించినా అతను పట్టించుకోకుండా లోపలకి వెళ్లే ప్రయత్నం చేశాడు. తనకు ఓ సమస్య ఉందని అదే విషయమై మేయర్ తో మాట్లాడాలంటూ కాసేపు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. దీంతో, ఆమె సిబ్బంది అతడిని అడ్డుకుని బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఈ రౌడీ షీటర్ చొరబడిన సమయంలో మేయర్ ఇంట్లో లేనట్లు సమాచారం.

ఆమె తండ్రి కే. కేశవరావుకు ఇటీవలే మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. ఈక్రమంలోనే ఆయన వద్ద ఆమె ఆసుపత్రిలోనే ఉన్నట్లుగా సమాచారం. మేయర్ సిబ్బంది ఫిర్యాదు మేరకు రౌడీ షీటర్ లక్ష్మణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, లక్ష్మణ్‌కు మతిస్థిమితం సరిగా లేనట్టు పోలీసులు గుర్తించారు. లక్ష్మణ్‌ గత రెండు రోజులుగా మేయర్‌ ఇంటి చుట్టే తిరిగినట్టు పోలీసులు తెలిపారు. మొత్తంగా లోక్‌సభ ఎన్నికల వేళ బంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో ఈ సంచలనం చోటుచేసుకుంది.

ఇటీవలే బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కూడా కాల్పులు జరిగిన సంఘటన తెలిసింది. గుర్తు తెలియన వ్యక్తులు ఇద్దరు వెళ్లి ..సల్మాన్ ఖాన్ ఇంటివైపు కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో సల్మాన్ ఖాన్ ఇంట్లో  లేడు. అయితే ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇలానే కొంతకాలం క్రితం రిలయన్స్ అధినేత ఉండే ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు సంచరించారు. ఇలా తరచూ ప్రముఖల ఇళ్ల ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి రౌడీ షీటర్ చొరపడ్డాడు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి