iDreamPost

హాస్పిటల్, క్లినిక్ రెండూ ఒకటే అనుకుంటారు.. కానీ వేర్వేరు అని మీకు తెలుసా?

చాలా మందికి హాస్పిటల్ కి, క్లినిక్ కి తేడా తెలియదు. చిన్న జబ్బు చేస్తే హాస్పిటల్ కి వెళ్తున్నాం అని అంటారు. కానీ నిజానికి వెళ్ళేది హాస్పిటల్ కి కాదు. స్థానికంగా ఉన్న చిన్న క్లినిక్ కి. క్లినిక్ కి, హాస్పిటల్ కి అంత తేడా ఉందా? అసలు క్లినిక్ అంటే ఏంటి? హాస్పిటల్ అంటే ఏంటి? క్లినిక్ కి, హాస్పిటల్ కి తేడా ఏంటి? అనే వివరాలు మీ కోసం. 

చాలా మందికి హాస్పిటల్ కి, క్లినిక్ కి తేడా తెలియదు. చిన్న జబ్బు చేస్తే హాస్పిటల్ కి వెళ్తున్నాం అని అంటారు. కానీ నిజానికి వెళ్ళేది హాస్పిటల్ కి కాదు. స్థానికంగా ఉన్న చిన్న క్లినిక్ కి. క్లినిక్ కి, హాస్పిటల్ కి అంత తేడా ఉందా? అసలు క్లినిక్ అంటే ఏంటి? హాస్పిటల్ అంటే ఏంటి? క్లినిక్ కి, హాస్పిటల్ కి తేడా ఏంటి? అనే వివరాలు మీ కోసం. 

హాస్పిటల్, క్లినిక్ రెండూ ఒకటే అనుకుంటారు.. కానీ వేర్వేరు అని మీకు తెలుసా?

హాస్పిటల్స్, క్లినిక్స్ ఈ రెండూ హెల్త్ కేర్ సిస్టంలో ముఖ్యమైనవి. కానీ ఈ రెండిటి ప్రాముఖ్యత, అవి అందించే సేవలు చాలా భిన్నంగా ఉంటాయి. హాస్పిటల్స్ ని తీసుకుంటే ఇవి పెద్దగా ఉంటాయి. పెద్ద పెద్ద అంతస్తుల్లో ఎక్కువ బెడ్స్, ఎక్కువ సిబ్బంది, ఎక్కువ మంది డాక్టర్లు, నర్సులు ఉంటే దాన్ని హాస్పిటల్ అంటారు. హాస్పిటల్ లో ఒక రోగి చేరితే కంటిన్యూగా చికిత్స అనేది అందుతుంది. రోగాలు, గాయాలు వంటి వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటారు. కన్సల్టేషన్, మెడికేషన్, వసతి తర్వాత కూడా ఈ సేవలు కొనసాగుతాయి. హాస్పిటల్స్ అనేవి క్లినిక్స్ తో పోలిస్తే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. డాక్టర్ కన్సల్టేషన్ ఫీజులు కూడా ఎక్కువగానే ఉంటాయి.

హాస్పిటల్స్ అంటే వారంలో అన్ని రోజులూ.. 24 గంటలూ ఓపెన్ లోనే ఉంటాయి. అపాయింట్మెంట్లు ఉంటాయి. అత్యవసర చికిత్సల కోసం హాస్పిటల్ కే రావాల్సి ఉంటుంది. క్లినిక్ కి వెళ్తే పనవ్వదు. సర్జరీ లేదా ఆపరేషన్ వంటి వాటి కోసం హాస్పిటల్ లో ఉన్న స్పెషలిస్ట్ ని కలవాల్సి ఉంటుంది. ఇక క్లినిక్స్ విషయానికొస్తే.. చిన్న బిల్డింగ్స్ లో ఉంటాయి. క్లినిక్స్ ద్వారా అవుట్ పేషెంట్ సేవలను అందిస్తారు. తక్కువ ధరకే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తారు. సాధారణ వైద్యం, నివారణ నాన్ ఎమర్జన్సీ సేవలను ఈ క్లినిక్స్ లో పొందవచ్చు. క్లినిక్స్ అనేవి 24 గంటలూ తెరిచి ఉండవు. వీక్ డేస్ లో మాత్రమే కేవలం కొన్ని గంటలు మాత్రమే తెరిచి ఉంటాయి. కొన్ని క్లినిక్స్ కి ఆదివారం సెలవు ఉంటుంది. కొన్నిటికి శనివారం సెలవు ఉంటుంది. ఒక్కో క్లినిక్ కి వారంలో ఒక్కో రోజు సెలవు ఉంటుంది. డాక్టర్ ని సంప్రదించాలంటే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి. జ్వరం, తలనొప్పి చిన్న చిన్న అనారోగ్యాలు వస్తే క్లినిక్ వెళ్తారు.

క్లినిక్స్ లో రకాలు ఉంటాయి. సమస్యను బట్టి క్లినిక్స్ లో రకాలు ఉంటాయి. ప్రైమరీ కేర్ క్లినిక్స్, సెక్సువల్ హెల్త్ క్లినిక్స్, అడిక్షన్ క్లినిక్స్, ఫిజికల్ థెరపీ క్లినిక్స్ అని ఇలా వివిధ రకాలు ఉంటాయి. ఉదాహరణకు డెంటల్ క్లినిక్, చెవి, ముక్కు, గొంతు క్లినిక్ అని, స్కిన్ క్లినిక్ అని ఇలా ఉంటాయి. ఎప్పుడైనా మనిషి కదలలేని స్థితిలో ఉండడం.. ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో నాలుగైదు రోజులు ఉండాల్సి వస్తే క్లినిక్స్ లో ఉండేందుకు ఉండదు. అదే హాస్పిటల్స్ లో అయితే బెడ్ సౌకర్యం, ప్రత్యేక గది, 24 గంటలు నర్సుల మానిటరింగ్ వంటివి ఉంటాయి. క్లియర్ గా చెప్పాలంటే ఒక సెలైన్ పెట్టించుకున్నప్పుడు ఒక 3, 4 గంటలు అంటే క్లినిక్ లో పెడతారు. అదే వరుసగా 2,3 రోజులు కంపల్సరీగా పెట్టించుకోవాలి అంటే కనుక హాస్పిటల్స్ లోనే వీలవుతుంది. మరి హాస్పిటల్ కి, క్లినిక్ కి తేడా తెలిసిందిగా. ఇక నుంచి చిన్న అనారోగ్యం కారణంగా క్లినిక్ కి వెళ్తే.. క్లినిక్ అనే అనండి. హాస్పిటల్ అని కాదు. ఈ కథనం మీకు నచ్చితే షేర్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి