iDreamPost
android-app
ios-app

ఓటేయడం కోసం దంపతులు సాహసం.. హైదరాబాద్‌ నుంచి 500 కిమీ స్కూటీపై వెళ్లి

  • Published May 13, 2024 | 6:06 PMUpdated May 13, 2024 | 6:26 PM

AP Election 2024: ఎన్నికల వేళ నగరంలో చాలా మంది ఓటు వేయడానికి బద్దకిస్తారు. అలాంటి వారికి ఆదర్శం ఈ జంట. వారు ఓటేయడం కోసం బైక్‌ మీద ఏకంగా 500 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఆ వివరాలు..

AP Election 2024: ఎన్నికల వేళ నగరంలో చాలా మంది ఓటు వేయడానికి బద్దకిస్తారు. అలాంటి వారికి ఆదర్శం ఈ జంట. వారు ఓటేయడం కోసం బైక్‌ మీద ఏకంగా 500 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఆ వివరాలు..

  • Published May 13, 2024 | 6:06 PMUpdated May 13, 2024 | 6:26 PM
ఓటేయడం కోసం దంపతులు సాహసం.. హైదరాబాద్‌ నుంచి 500 కిమీ స్కూటీపై వెళ్లి

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్‌ జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు ఓటింగ్‌ జరుగుతుంది. ఓటేసేందుకు జనాలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఇక ప్రతి ఒక్కరు ఓటు వేయాలని.. కచ్చితంగా తమ హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం పదే, పదే చెబుతుంది. ఓటు హక్కు వినియోగం గురించి సెలబ్రిటీలు కూడా ప్రచారం చేస్తుంటారు. ఇక నేడు ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా.. తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ హైదారబాద్‌లో సెటిలైన ఏపీ ఓటర్లు సొంత ఊర్లకు క్యూ కట్టారు.. మూడు రోజులు ముందుగానే సొంత గ్రామాలకు చేరుకున్నారు. బస్సులు, రైళ్లు, విమానాలన్నీ ఫుల్లు రద్దీగా మారాయి.. ఈ క్రమంలో ఓ భార్యాభర్తలు ఓటు వేయడం కోసం హైదారాబాద్ నుంచి దాదాపు 500 కిలో మీటర్లు ప్రయాణించి సొంత ఊరికి వెళ్లారు. వారి ప్రయాణం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఇంతకు ఎవరా జంట అంటే..

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురుకు చెందిన లక్ష్మణరావు.. హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో.. ఓటు వేయడానికి లక్ష్మణ రావు.. తన భార్య కనకలక్ష్మితో కలిసి సొంత ఊరుకి వెళ్లాలనుకున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ కలిసి శనివారం ఉదయం 5 గంటలకే బస్టాండ్‌కు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత బస్సులు ఫుల్లు రద్దీగా ఉన్నాయి.. బస్సు కోసం ఉదయం 10 గంటల వరకు అక్కడే వేచి ఉన్నారు. కానీ ఒక్క బస్సులో కూడా సీటు దొరకలేదు. అయినా సరే ఆ దంపతులు ఓటు వేయడానికి సొంత ఊరు వెళ్లాల్సిందేనని ఫిక్స్ అయ్యారు.

బస్సులు, రైళ్లు రద్దీగా ఉన్నాయి.. మరి ఏం చేయాలి.. ఊరికి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తుండగా వారికి కనిపించిన పరిష్కారం.. స్కూటీ. ఈ ఆలోచన రావడమే ఆలస్యం.. వెంటనే భార్యాభర్తలు తమ దగ్గర ఉన్న కైనటిక్‌ హోండాపై సొంతూరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రయాణం ప్రారంభించారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒకసారి ఆగి విశ్రాంతి తీసుకుంటూ తమ ప్రయాణం కొనసాగించారు. ఇలా మెల్లిగా రాత్రి 11.30 గంటలకు విజయవాడ చేరుకున్నారు.

అక్కడ రెండు గంటల పాటూ నిద్రపోయారు.. మళ్లీ ప్రయాణం ప్రారంభించి ఆదివారం ఉదయం 6 గంటలకు రామచంద్రాపురం చేరుకున్నారు. అక్కడ బంధువుల ఇంట్లో టిఫిన్ చేశారు. అక్కడి నుంచి మళ్లీ బయల్దేరి ఉదయం 9 గంటలకు సొంత ఊరు కొంకుదురు చేసుకున్నారు. పక్కనే పోలింగ్‌ కేంద్రం ఉన్నా సరే.. ఓటు వేయకుండా బద్దకించే వాళ్లకు ఈ దంపతులు ఆదర్శం అని చెప్పాలి. ఏకంగా 500 కిలోమీటర్లు.. అది కూడా బైక్‌ మీద ప్రయాణించి సొంత ఊరికి వెళ్లి ఓటేస్తున్నారంటే.. రాష్ట్రం పట్ల వారికున్న బాధ్యతను తెలియజేస్తుంది అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి