iDreamPost

రాజకీయ పార్టీ పెడతానంటున్న అనిల్ రావిపూడి..!

అనిల్ రావిపూడి.. ఇంట్లో భార్య భర్తల మధ్య ఉన్న గొడవలతో సినిమాలు తీసేస్తాడు. మాస్ పల్స్ పట్టుకుని మూవీస్ హిట్స్ కొట్టేస్తున్నాడు. మాటల మాయాజాలంతో కట్టిపడేస్తుంటారు. తనలో కనిపించని నటుడు, డ్యాన్సర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు మరో అవతారంలో కనిపించి...

అనిల్ రావిపూడి.. ఇంట్లో భార్య భర్తల మధ్య ఉన్న గొడవలతో సినిమాలు తీసేస్తాడు. మాస్ పల్స్ పట్టుకుని మూవీస్ హిట్స్ కొట్టేస్తున్నాడు. మాటల మాయాజాలంతో కట్టిపడేస్తుంటారు. తనలో కనిపించని నటుడు, డ్యాన్సర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు మరో అవతారంలో కనిపించి...

రాజకీయ పార్టీ పెడతానంటున్న అనిల్ రావిపూడి..!

టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా మారిపోయాడు అనిల్ రావిపూడి. డైలాగ్ రైటర్‌గా కెరీర్ స్టార్ చేసిన ఈ ఒంగోలు కుర్రాడు.. పటాస్ మూవీతో దర్శకుడిగా మారాడు. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. మాస్ యాంగిలే కాదూ.. కంప్లీట్ ఫ్యామిలీ మూవీస్ తీయగలనని ఎఫ్ 2తో నిరూపించుకున్నాడు. తనలోని హ్యమరస్‌ను తెరపై ఎక్కించడంలో సిద్ధ హస్తుడు. బడా హీరోలతో సినిమాలు చేసుకుంటూ.. వారికి హిట్స్ అందిస్తూ.. తాను ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన భగవంత్ కేసరితో మరోసారి కుటుంబ ప్రేక్షకులను, ఇటు మాస్ అభిమానులను ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ చేశాడు. ఏ జోనర్ చిత్రాలు చేసినా.. పైసా వసూలు ఖాయం.

ఇప్పటి వరకు ఫెయిల్యూర్ ఎరుగని ఈ దర్శకుడు తదుపరి మూవీ ఎవరితో చేస్తాడన్న ఆసక్తి నెలకొంది. అయితే అంతలో కొత్త గెటప్‌లో దర్శనమిచ్చి అందర్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. రాజకీయ దుస్తుల్లో కనిపించి.. పార్టీ పెడతానంటూ కంగారు పెడుతున్నాడు. ఈ సందర్భంగా ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ‘ నేను డైరెక్ట్ చేశాను. మీరు హిట్ చేశారు. నేను ఎంటర్ టైన్ చేశాను. మీరు ఎంటర్ టైన్ అయ్యారు. గెలిచేది నేనైనా, గెలిపించేది మీరు. కానీ ఈ సారి నా గెలుపు థియేటర్లలో కాదూ. ఓ అసెంబ్లీ, ఓ పార్లమెంట్, ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. బాక్సా ఫీస్ సక్సెస్ చూసిన నాకు, బ్యాలెట్ బాక్స్ సక్సెస్ చూడాలని ఉంది. అదేనండి మనం పార్టీ పెట్టబోతున్నాం. మన పార్టీ పేరేంటో, మన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరో, మొత్తం సమాచారంతో త్వరలో వస్తా’ అన్నారు.

అయితే ఈ వీడియోపై ఆహా లోగో ఉండటంతో ఆ ఓటీటీ సంస్థ ఏదైనా ప్రోగ్రామ్ చేస్తుందన్న అనుమానం కలుగుతుంది. అనిల్ రావిపూడి రాజకీయ అవతారంలోకి మారిపోగానే.. కామెంట్లు వచ్చేస్తున్నాయి. పొలిటికల్ మూవీ తీస్తున్నారు కదా అని, వెయిటింగ్ అంటూ, ఆల్ రౌండర్ అనిల్ అంటూ, ఆహా సింబల్ లేకుండా నిజంగా రాజకీయాల్లోకి వస్తావని నమ్మేటోళ్లం అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది ఏమన్నా మూవీ ప్రమోషనా లేక, ప్రోగ్రామ్ సంబంధించిన అప్ డేటా తెలియాల్సి ఉంది. అనిల్ రావిపూడి డైరెక్టరే కాదూ అతడిలో మంచి నటుడు, డ్యాన్సర్ ఉన్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. భగవంత్ కేసరితో హిట్ అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్ తదుపరి అడుగులు ఎటు వైపో మరీ.

 

View this post on Instagram

 

A post shared by Anil Ravipudi (@anilravipudi)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి