iDreamPost

Video: IPL ఫైనల్ లో గెలిచాక ఆ హీరోయిన్ తో కలిసి రస్సెల్ స్టెప్పులు!

Andre Russell Dances With Ananya Panday: ఇక ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన ఆనందంలో కేకేఆర్ టీమ్ సంతోషాల్లో మునిగి తేలింది. ఫైనల్ మ్యాచ్ లోవిజయం అనంతరం గ్రౌండ్ లో ఓ రేంజ్ లో సెలెబ్రేషన్ చేసుకున్నారు.

Andre Russell Dances With Ananya Panday: ఇక ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన ఆనందంలో కేకేఆర్ టీమ్ సంతోషాల్లో మునిగి తేలింది. ఫైనల్ మ్యాచ్ లోవిజయం అనంతరం గ్రౌండ్ లో ఓ రేంజ్ లో సెలెబ్రేషన్ చేసుకున్నారు.

Video: IPL ఫైనల్ లో గెలిచాక ఆ హీరోయిన్ తో కలిసి రస్సెల్ స్టెప్పులు!

రెండు రోజుల క్రితమే ఐపీఎల్ సీజన్ 17 ముగిసింది. ఉత్కంఠగా సాగుతోందని అనుకున్న మ్యాచ్ వన్ సైడ్ గా మారింది. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. 8 వికెట్ల తేడాతో కోలకతా విజయం సాధించింది. దీంతో ఐపీఎల్ ట్రోపీని కేకేఆర్ మూడో సారి ముద్దాండి. ఇక ఐపీఎల్ 2024 టైటిల్ గెలిచిన ఆనందంలో కేకేఆర్ టీమ్ సంతోషాల్లో మునిగి తేలింది. ఫైనల్ మ్యాచ్ లో విజయం అనంతరం గ్రౌండ్ లో ఓ రేంజ్ లో సెలెబ్రేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత మైదానం వెలుపల భారీగా సంబరాలు చేసుకుంటూ కనిపించారు. ఈ క్రమంలో ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది.

ఐపీఎల్ 2024 ట్రోపీని కోల్ కతా గెలిచిన ఆనందంలో ఆ టీమ్ చేసుకున్న సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక ఈ సెలబ్రేషన్ పార్టీలో ప్రధాన ఆకర్షణగా కేకేఆర్ టీమ్ స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ నిలిచాడు.  బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేతో కలిసి ఈ క్రికెటర్ స్టెప్పులేశాడు. ఈ సీజన్ లో కేకేఆర్ విజయ తీరాలకు చేర్చడంలో రస్సెల్ కీలక పాత్ర పోషించాడు. నరైన్ వంటి స్టార్లు ఉన్నప్పటికీ రస్సెల్  కేకేఆర్ టీమ్ కి మెయిన్ ప్లేయర్ గా ఉన్నాడు. ఈ మ్యాచ్ లో 2.3 ఓవర్లు వేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈ టోర్నీ అంతటా బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటాడు. ఫైనల్ మ్యాచ్ లో కూడా తనదైన బౌలింగ్ తో ఎస్ఆర్ హెచ్ ను కట్టడి చేశాడు. అలా మొత్తంగా ఐపీఎల్ సీజన్ 17లో కేకేఆర్ విజేతగా నిలవడంలో ఈ విండీస్ వీరుడు తమ జట్టు టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.

అందుకే అనంతరం జరిగిన సంబరాల్లో రస్సెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తో కలిసి డ్యాన్స్ వేస్తూ సందడి చేశాడు. ఈ అమ్మడితో కలిసి తనకు ఇష్టమైన పంజాబీ పాట ‘లూట్ పుట్ గయా’ అనే పాటకు చిందులేశాడు. రస్సెల్ స్టెప్పులేసిన ఈ పాట షారుఖ్ ఖాన్ నటించిన డుంకీ  చిత్రంలోనిది. కరేబియన్ ప్లేయర్లకు పార్టీలో డ్యాన్స్ లు వేయడం తెగ సరదా. గేల్, బ్రావో లాంటి వెస్టిండీస్ ఆటగాళ్లు గతంలో డ్యాన్స్ చేస్తూ సందడి చేసిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం రస్సెల్, అనన్యపాండే స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఆ వీడియోను వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి