iDreamPost

కరోనా కట్టడిలో ఆంద్రప్రదేశే స్పూర్తి – బ్రిటీష్ డిప్యుటీ హై కమీషనర్

కరోనా కట్టడిలో ఆంద్రప్రదేశే స్పూర్తి – బ్రిటీష్ డిప్యుటీ హై కమీషనర్

కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో వై.యస్ జగన్ నేతృత్వంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న కృషికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుండీ ఇతర రాష్ట్రాల ప్రతినిధుల వరకు అనేక మంది నుండి అభినందనలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రిగా జగన్ కరోనా కట్టడికి తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలను ఇప్పటికే అనేక రాష్ట్రాలు కూడా అనుసరించడం మొదలు పెట్టిన విషయం విదితమే. దేశంలోనే అత్యదిక టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా అలాగే టెస్టుల ఆధారంగా అతితక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా ఇప్పటికే ఆరోగ్యశాఖ కూడా గుర్తించింది.

Also Read: కరోనా కట్టడికి ఆంద్రప్రదేశ్ వ్యూహాలను అనుసరిస్తున్న ఇతర రాష్ట్రాలు

ఈ నేపధ్యంలో ఇప్పుడు తాజాగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ కరోనా కట్టడికి తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు , ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి అని బ్రిటీష్ డిప్యుటీ హై కమీషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు. బ్రిటన్ దేశానికి చెందిన ఆండ్రూ 2017లో ఆంద్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు బ్రిటీష్ డిప్యుటీ హై కమీషనర్ గా నియమితులైన విషయం తెలిసినదే , 1986లో బ్రిటీష్ సివిల్ సర్వీస్ లో చేరిన ఆండ్రూ ఉద్యోగ రీత్యా ఉగాండా , నైజీరియా , ఘనా దేశాల్లో బ్రిటన్ తరుపున సేవలు అందించారు. ఈ నేపద్యంలో ఆంద్రప్రదేశ్ కి తెలంగాణ రాష్ట్రాలకు డిప్యుటీ కమీషనర్ గా సేవలు అందిస్తున్న ఆండ్రూ చేసిన ట్వీట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఎంత ముందు చూపుతో వ్యవహరిస్తుందో అర్ధం చేసుకోవచ్చు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి