iDreamPost

వీడియో: వరల్డ్ కప్ ఫైనల్లో మరో ఆకర్షణ.. రివీల్ చేసిన ఆనంద్ మహీంద్ర!

IND vs AUS: నవంబర్ 19న అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ 2023 ఫైనల్ జరగబోతోంది. ఈ మ్యాచ్ ముగింపు వేడుకలను బీసీసీఐ గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తోంది.

IND vs AUS: నవంబర్ 19న అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ 2023 ఫైనల్ జరగబోతోంది. ఈ మ్యాచ్ ముగింపు వేడుకలను బీసీసీఐ గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తోంది.

వీడియో: వరల్డ్ కప్ ఫైనల్లో మరో ఆకర్షణ.. రివీల్ చేసిన ఆనంద్ మహీంద్ర!

వరల్డ్ కప్ 2023లో భారత్- ఆస్ట్రేలియా జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. ఎలా అయితే సెమీస్ లో న్యూజిలాండ్ కు 2019 బాకీని తీర్చేశారో.. అలాగే 2003నాటి బాకీని కూడా ఆస్ట్రేలియాకి తీర్చేయాలంటూ టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈసారి వరల్డ్ కప్ కొట్టి ఆస్ట్రేలియాపై పైచేయి సాధించాలంటూ ఆకాంక్షిస్తున్నారు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ను బీసీసీఐ ఇప్పటికే చాలా స్పెషల్ గా ప్లాన్ చేసింది. ముగింపు వేడుకల్లో దువా లిపా పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందని చెబుతున్నారు. అయితే అంతకుమించి గూస్ బంప్స్ తెప్పించే ఒక విషయం జరగబోతోంది అంటూ ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో కూడా తన ఎక్స్ ఖాతాలో అప్ లోడ్ చేశారు.

వరల్డ్ కప్ 2023ని బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లనీ ఒకెత్తు అయితే ముగింపు వేడుకలు నెక్ట్స్ లెవల్లో ఉండబోతున్నాయి అంటూ ఇప్పటి నుంచి హైప్ ఎక్కిస్తున్నారు. ఇప్పటికే దువా లిపా పర్ఫార్మెన్స్ ఉంటుందని చెబుతున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అంతకు మించిన ఒక సీక్రెట్ ని ఆనంద్ మహీంద్రా రివీల్ చేశారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఒక్క భారతీయులకే కాదు.. యావత్ క్రికెట్ ప్రపంచానికి గూస్ బంప్స్ తెప్పించే ఒక పనిని బీసీసీఐ ప్లాన్ చేసింది. అందుకు సంబంధించిన ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. ఆ వీడియోనే ఆనంద్ మహీంద్ర తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. విషయం ఏంటంటే.. ఈ వరల్డ్ కప్ ఫైనల్ కి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం మీద ఇండియన్ ఎయిర్స్ ఫోర్స్ విన్యాసాలను చేయనుంది. దానికోసం ఇప్పటికే ట్రయల్స్ కూడా పూర్తి చేసింది. ఆ విషయాన్నే స్పాయిలర్ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. “స్పాయిలర్ అలర్ట్.. మొటేరాలోని టెక్ మహీంద్రా సెంటర్ ని చూసుకునే నా సహోద్యోగి మనీష్.. వరల్డ్ కప్ ఫైనల్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రాక్టీస్ డ్రిల్ చేస్తున్న ఈ దృశ్యాలను నాకు పంపాడు. గూస్ బంప్స్ వస్తున్నాయి” అంటూ ఆనంద్ మహీంద్రా చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. టీమిండియా అభిమానులు అందరూ ఆనందంలో మునిగిపోతున్నారు. ఇలాంటి ఒక ముగింపు వేడుకలో మళ్లీ సాధ్యమేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ వరల్డ్ కప్ 2023 ముగింపు వేడుకలు ఎప్పటికీ గుర్తిండిపోతాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంక ఫైనల్ విషయానికి వస్తే.. ఈ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి తప్పకుండా భారత్ కప్పు కొట్టాలంటూ కోరుకుంటున్నారు. ఇలా వరల్డ్ కప్ ఫైనల్లో మళ్లీ భారత్- ఆసీస్ ఎప్పుడు తలపడతాయో? మన 20 ఏళ్లనాటి పగను ఈ మ్యాచ్ తో తీర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాల్సిందే అంటూ టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. మరి.. వరల్డ్ కప్ 2023 ముంగింపు వేడుకలకు బీసీసీఐ చేస్తున్న ఏర్పాట్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి