iDreamPost
android-app
ios-app

వీడియో: ఆస్ట్రేలియా-నాకౌట్‌-యువరాజ్‌ సింగ్‌.. ఇది నెవర్‌ ఎండింగ్‌ లవ్‌స్టోరీ! WCL సెమీస్‌లో కూడా..

  • Published Jul 13, 2024 | 11:04 AMUpdated Jul 13, 2024 | 11:04 AM

Yuvraj Singh, WCL 2024, IND vs AUS: టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌కు ఆస్ట్రేలియా అంటే ఎంత కసో మరోసారి రుజువైంది. రిటైర్‌ అయినా కూడా.. కంగారులను ఇంటికి పంపించాడు యువీ. అతని ఊచకోత గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచ క్రికెట్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ టీమ్‌ ఆస్ట్రేలియా. ఏ బిగ్‌ ఈవెంట్‌లో అయినా.. ఆ జట్టు నాకౌట్‌ స్టేజ్‌కి వచ్చిందంటే అద్భుతంగా ఆడుతుంది. కానీ, నాకౌట్‌ స్టేజ్‌లో ఆస్ట్రేలియాను ఓడించే మొగోడు ఎవడైనా ఉన్నాడా అంటే అది యువరాజ్‌ సింగ్‌ ఒక్కడే అని చెప్పాలి. 2007 టీ20 వరల్డ్‌ కప్‌లో, 2011 వన్డే వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియాను ఇంటికి పంపింది యువరాజ్‌ సింగే. నాకౌట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ అంటే చాలు తన శక్తినంతా ధారపోస్తూ ఏ పూనకం వచ్చినట్లు ఆడుతుంటాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయినా.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ అనగానే మళ్లీ వింటేజ్‌ యువీని బయటికి తీశాడు.

వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ 2024లో భాగంగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువీ ఫోర్లు సిక్సులతో ఆసీస్‌ బౌలర్లను చీల్చిచెండాడు. కేవలం 28 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సులతో 59 పరుగులతో అదరగొట్టాడు. యువీతో పాటు ఓపెనర్‌ రాబిన్‌ ఊతప్ప 35 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సలతో 65, యూసుఫ్‌ పఠాన్‌ 23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 51, ఇర్ఫాన్‌ పఠాన్‌ 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 50 పరుగులు దుమ్మురేపారు. అంబటి రాయుడు, రైనా విఫలం అయ్యారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా ఛాంపియ్స్‌ టీమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఊతప్ప, కెప్టెన్‌ యువరాజ్‌ సింగ్‌, యూసుఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ హాఫ్‌ సెంచరీలతో రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో పీటర్ సిడిల్ 4 వికెట్లతో రాణించాడు. ఆ జట్టు కెప్టెన్‌ బ్రెట్‌ తీ 4 ఓవర్లలో ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక 255 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులు మాత్రమే చేసి.. 86 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. భారత బౌలర్లలో ధావల్‌ కులకర్ణి, పవన్‌ నెగీ రెండేసి వికెట్లతో రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో యువరాజ్‌ సింగ్‌ ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి