iDreamPost
android-app
ios-app

Rohit Sharma: బాల్ టాంపరింగ్ ఆరోపణలపై రోహిత్ కౌంటర్! ఇంజమామ్ కు ఇచ్చిపడేశాడు..

  • Published Jun 27, 2024 | 9:11 AM Updated Updated Jun 27, 2024 | 9:11 AM

టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్ బాల్ టాంపరింగ్ చేశాడని ఇంజమాన్ చౌకబారు ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.

టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్ బాల్ టాంపరింగ్ చేశాడని ఇంజమాన్ చౌకబారు ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.

Rohit Sharma: బాల్ టాంపరింగ్ ఆరోపణలపై రోహిత్ కౌంటర్! ఇంజమామ్ కు ఇచ్చిపడేశాడు..

టీ20 వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది. గయనా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం.. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్తాన్ దిగ్గజం, మాజీ ప్లేయర్ ఇంజమామ్ ఉల్ హక్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్ బాల్ టాంపరింగ్ చేశాడని ఇంజమాన్ చౌకబారు ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చాడు హిట్ మ్యాన్.

“ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా యంగ్ పేసర్ అర్షదీప్ సింగ్ బాల్ టాంపరింగ్ చేశాడు. దాంతో అసాధారణమైన రివర్స్ స్వింగ్ రాబడుతున్నాడు. సాధారణంగా బంతి పాతబడిన తర్వాత రివర్స్ స్వింగ్ అవుతుంది. కానీ ఈ మ్యాచ్ లో కొత్త బంతితోనే అతడు రివర్స్ స్వింగ్ ను రాబట్టాడు. అంపైర్లు ఇప్పటికైనా కళ్లు తెరిచి చూడాలి” అని అర్షదీప్ సింగ్ పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు చేశాడు పాకిస్తాన్ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్. ఇక ఈ చౌకబారు, తెలివితక్కువ ఆరోపణలపై కౌంటర్ ఇచ్చాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.

తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రోహిత్ శర్మ మాట్లాడుతూ..”ఈ క్వశ్చన్ కు నేను ఏం సమాధానం ఇవ్వాలి. కాస్త బుర్ర వాడితే వారికే ఈ విషయం అర్ధం అవుతుంది. ఎండలో మ్యాచ్ ఆడుతున్నప్పుడు బంతి దానికి అదే రివర్స్ స్వింగ్ అవుతుంది. ఇది ఒక్క టీమిండియాకే కాకుండా.. అన్ని జట్లకు జరుగుతుంది. పైగా మేం ఎక్కడ ఆడుతున్నామో గుర్తించాలి. వరల్డ్ కప్ ఆడేది ఇంగ్లండ్ ఆస్ట్రేలియాలో కాదు. కాస్త బుర్ర వాడండి” అంటూ తనదైన శైలిలో ఇంజమామ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. మరి బాల్ టాంపరింగ్ ఆరోపణలపై ఇంజమామ్ కు రోహిత్ కౌంటర్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.