iDreamPost

ట్రైనీ ఎయిర్ హోస్టేస్ హత్య కేసు.. లాకప్ లో నిందితుడి ఆత్మహత్య!

ట్రైనీ ఎయిర్ హోస్టేస్ హత్య కేసు.. లాకప్ లో నిందితుడి ఆత్మహత్య!

ముంబైలోని ట్రైనీ ఎయిర్ హోస్టేస్ రూపాల్ ఓగ్రే హత్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న విక్రమ్ అత్వాల్ ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. కాగా, ఈ క్రమంలోనే తాజాగా అతడు టాయిలెట్ కోసమని చెప్పి వాష్ రూమ్ లోకి వెళ్లాడు. చాలా సేపు అయిన విక్రమ్ వాష్ రూమ్ నుంచి బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా.. అతడు ప్యాంట్ తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా పోలీసులు తెలిపారు. అనంతరం అతడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఈ కేసులో ఏం జరిగిందంటే?

ఛత్తీస్ గఢ్ కు చెందిన రూపాల్ ఓగ్రే (19) అనే యువతి ఎయిరిండియాకు ఎయిర్ హోస్టేస్ గా ఎంపికైంది. దీంతో ఈ మధ్యే ముంబై చేరుకుని అంధేరిలోని ఓ అపార్ట్ మెంట్ లోని ఓ ఇంట్లో సోదరితో పాటు మరో ఫ్రెండ్ తో కలిసి ఉంటున్నారు. అయితే వారం రోజుల కిందట ఆమె సోదరి, ఫ్రెండ్ ఇంటికి వెళ్లడంతో రూమ్ లో రూపాల్ ఒంటరిగా ఉంది. ఈ క్రమంలోనే విక్రమ్ అత్వాల్ అనే యువకుడు ఈమె ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత రూపాల్ పై అత్యాచారం చేయబోయాడు. దీంతో ఈ యువతి ప్రతిఘటించింది. ఈ క్రమంలోనే విక్రమ్ ఆ యువతిని అతి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు.

ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని ఎట్టకేలకు నిందితుడు విక్రమ్ అత్వాల్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అతడు టాయిలెట్ కు అని చెప్పి వాష్ రూమ్ లోకి వెళ్లాడు. ఎంతసేపటికి బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా.. నిందితుడు విక్రమ్ తన ఫ్యాంటుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న విక్రమ్ ఆత్మహత్య చేసుకోవడంతో ఊహించని పరిణామంగా మారింది. ఇంతకు ఈ కేసు ఎక్కడికి వెళ్తుందనేది చూడాలి మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి