iDreamPost
android-app
ios-app

బ్రేకప్‌ చెప్పిన ప్రియురాలు .. ఆమె కోసం పోలీస్‌ స్టేషన్‌కు ప్రియుడు!

  • Published Sep 08, 2023 | 3:08 PM Updated Updated Sep 08, 2023 | 3:08 PM
  • Published Sep 08, 2023 | 3:08 PMUpdated Sep 08, 2023 | 3:08 PM
బ్రేకప్‌ చెప్పిన ప్రియురాలు .. ఆమె కోసం పోలీస్‌ స్టేషన్‌కు ప్రియుడు!

బ్రేకప్‌ చెప్పిన ప్రియురాలి కోసం ఓ యువకుడు పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కాడు. తన ప్రియురాలితో పెళ్లి చేయించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసులు మాత్రం అతడి గోడును పట్టించుకోలేదు. అయినా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ప్రతినిత్యం పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడుకు చెందిన మణికంఠ అనే యువకుడు బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు.

అతడికి నెల నెలా 40వేల రూపాయల జీతం వస్తోంది. ఇతడు జయనగరలో ఓ రూము తీసుకుని ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం మణికంఠకు బెంగళూరుకు చెందిన ఓ యువతితో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రెండేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. కలిసి సినిమాలకు షికార్లకు తిరిగారు. అయితే, పెళ్లి విషయం మాట్లాడేసరికి యువతి ముఖం చాటేసింది. అతడితో అన్ని సంబంధాలు తెంచేసుకుంది. ఫోన్లు, మెసేజ్‌లు చేసి మణికంఠ విసిగిపోయాడు.

తర్వాత బాగా ఆలోచించి పోలీసులను ఆశ్రయించాడు. బ్రేకప్‌ చెప్పి వెళ్లిపోయిన ప్రియురాలితో పెళ్లి చేయాలంటూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నారు. యువతిని పోలీసులు సంప్రదించగా.. తనకు అతడితో పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. దీంతో పోలీసులు కేసును పక్కన పెట్టేశారు. మణికంఠ మాత్రం తరచుగా పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ప్రియురాలితో ఎలాగైనా పెళ్లి చేయించాలంటూ పోలీసులను ప్రాథేయపడుతున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabet