iDreamPost

Ambati Rayudu: YCPలో చేరిన అంబటి రాయుడు.. అక్కడి నుంచే పోటీ చేస్తానంటూ ప్రకటన

  • Published Dec 29, 2023 | 9:47 AMUpdated Dec 29, 2023 | 9:47 AM

ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ టీమిండియా ప్లేయర్ అంబటి రాయుడు.. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో చెప్పుకొచ్చారు. ఆ వివరాలు..

ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ టీమిండియా ప్లేయర్ అంబటి రాయుడు.. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో చెప్పుకొచ్చారు. ఆ వివరాలు..

  • Published Dec 29, 2023 | 9:47 AMUpdated Dec 29, 2023 | 9:47 AM
Ambati Rayudu: YCPలో చేరిన అంబటి రాయుడు.. అక్కడి నుంచే పోటీ చేస్తానంటూ ప్రకటన

వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలన్ని ఎన్నికల్లో గెలవడం కోజం ఇప్పటి నుంచే వ్యూహాలు ప్రారంభించాయి. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించడమే టార్గెట్ గా పెట్టుకుంది అధికార వైసీపీ పార్టీ. మరోవైపు టీడీపీ-జనసేన కూటమిగా ఏర్పడి వైసీపీని ఓడించాలని ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించాయి. కానీ పొత్తు ప్రకటన వెలువడిన నాటి నుంచి రెండు పార్టీల నేతల మధ్య కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో జనసేన నేతలు, కార్యకర్తలు, కాపు నేతలు ఆగ్రహంగా ఉన్నారు.

మరి వీరి కూటమి ముందుకు సాగుతుందో.. లేదంటే విడిపోతారో చూడాలి అంటున్నారు జనాలు. ఇదిలా ఉండగా.. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో అధికార వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. అలానే పలువురు ప్రముఖులు కూడా పార్టీలో చేరుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే

గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రాయుడికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనంతరం అంబటి రాయుడు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమ కోసం పాటు పడుతున్న ముఖ్యమంత్రి జగన్ మీద ముందు నుంచి తనకు మంచి అభిప్రాయం ఉందని చెప్పుకొచ్చారు. కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నారంటూ జగన్ పై రాయుడు ప్రశంసల వర్షం కురిపించారు.

తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని రాయుడు స్పష్టం చేశారు. రాయుడు వైసీపీలో చేరడంతో.. ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా.. ఒకవేళ బరిలో దిగితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై ఊహాగానాలు మొలయ్యాయి. అయితే తాజాగా వీటిపై అంబటి క్లారిటీ ఇచ్చారు. తనకు అవకాశం వస్తే.. రానున్న ఎన్నికల్లో ఆయన ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని.. అది కూడా గుంటూరు నుంచే అని చెప్పుకొచ్చారు.

ఇప్పటికే రాయుడు గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలు విద్యార్థులు, యువతతో మమేకమయ్యారు. అంతేకాక గతంలో అనేక సార్లు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సీఎం జగన్ విధానాలకు సపోర్ట్ గా ట్వీట్లు చేశారు. దాంతో ఆయన వైసీపీలో చేరతారని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ఇక తాజాగా పార్టీలో చేరిన అంబటి.. తాను గుంటూరు నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు.

త్వరలోనే సీఎం జగన్.. గుంటూరులో తాను పోటీ చేయబోయే స్థానం గురించి ప్రకటిస్తారని చెప్పుకొచ్చారు. గుంటూరు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చారు. తాను గుంటూరు ప్రజలకి నిత్యం అందుబాటులోనే ఉంటానని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలోని అనేక గ్రామాల్లో పర్యటించానని.. ఒక్కో ఊరికి ఒక్కో సమస్య ఉందని.. వాటన్నింటిని పరిష్కారం కోసం పని చేస్తానని చెప్పుకొచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి