iDreamPost

హుటాహుటిన దుబాయ్ వెళ్లిన అల్లు అర్జున్.. కారణం ఏంటంటే?

Allu Arjun Went to Dubai: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ లో నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్, విశాఖలో షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

Allu Arjun Went to Dubai: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ లో నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్, విశాఖలో షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

హుటాహుటిన దుబాయ్ వెళ్లిన అల్లు అర్జున్.. కారణం ఏంటంటే?

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో అల్లు అర్జున్ ఒకరు. గంగోత్రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తర్వాత వరుస చిత్రాలతో దుమ్మురేపాడు. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ‘పుష్ప’తో ప్రపంచ వ్యాప్తంగా ఒక ట్రెండ్ సృష్టించారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగానికి చెందిన వారు అల్లు అర్జున్ స్టైల్ ఫాలో అయ్యారు. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింతగ్ హైదరాబద్, విశాఖ లో షూటింగ్ షెడ్యూల్ ముగించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న బన్నీ తన భార్యా పిల్లలతో హుటాహుటిన దుబాయ్ వెళ్లారు. అయితే ఇది వేకేషన్ టూర్ కాదట.. మరి అంత హడావుడిగా ఎందుకు వెళ్లారో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో హుటాహుటిన దుబాయ్ వెళ్లారు. ఇటీవల పుష్ప 2 షెడ్యూల్ పూర్తి కావడంతో ఆయనకు ఖాళీ సమయం లభించింది. ఈ నేపథ్యంలో తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హతో దుబాయ్ బయలుదేరారు. అయితే ఇది వెకేషన్ టూర్ కాదని.. ప్రస్తుతం దుబాయ్ లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరించబడింది. ఈ సందర్భంగా ఆ ఈవెంట్ కి హాజరయ్యేందుకు బన్నీ తన ఫ్యామిలీతో బయలుదేరినట్లు తెలుస్తుంది. పుష్ప మూవీతో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు బన్నీ.  తమ అభిమాన హీరో విగ్రహం మ్యూజియంలో ఆవిష్కరిస్తున్న విషయం తెలుసుకొని ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు.

మార్చి 28 న  రాత్రి 8 గంటలకు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు.  ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తెలుగు హీరోలు ప్రభాస్, మహేష్ మైనపు బొమ్మలు ఉన్నాయి. ఇవి లండన్ మ్యూజికంలో ఏర్పాటు చేశారు. అయితే అల్లు అర్జున్ విగ్రహం మాత్రం దుబాయ్ మ్యూజియం లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మ్యూజియంలో ఏర్పాటు చేయడం తొలి ఇండియన్ యాక్టర్ అల్లు అర్జున్ కావడం మరో విశేషం. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 షూటింగ్ త్వరగా పూర్తి చేసుకొని ఆగస్టు 15న విడుదల చేయాడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి