iDreamPost

21 ఏళ్ల నాటి పగ.. పుష్ప 2 ద్వారా తీర్చుకున్న అల్లు అర్జున్

ఎదిగిన ప్రతి మనిషికీ ఒక కథ ఉంటుంది. ఆ కథలో అవమానాలు ఉంటాయి. ఆ అవమానాలన్నిటికీ ఆ మనిషి విజయమే సమాధానం చెబుతుంది. అల్లు అర్జున్ విషయంలో కూడా ఇదే జరిగింది. 21 ఏళ్ల నాటి పగ.. పుష్ప 2 ద్వారా నెరవేర్చుకున్నాడు. ఆ కథ తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదివేయండి.

ఎదిగిన ప్రతి మనిషికీ ఒక కథ ఉంటుంది. ఆ కథలో అవమానాలు ఉంటాయి. ఆ అవమానాలన్నిటికీ ఆ మనిషి విజయమే సమాధానం చెబుతుంది. అల్లు అర్జున్ విషయంలో కూడా ఇదే జరిగింది. 21 ఏళ్ల నాటి పగ.. పుష్ప 2 ద్వారా నెరవేర్చుకున్నాడు. ఆ కథ తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదివేయండి.

21 ఏళ్ల నాటి పగ.. పుష్ప 2 ద్వారా తీర్చుకున్న అల్లు అర్జున్

విమర్శ.. ఇది ఒక మనిషిని ఎదిగేలా చేస్తుంది. అదే విమర్శకి డిజిటల్ రెక్కలు వస్తే మాత్రం పిచ్చికి పరాకాష్ట అవుతుంది. ఒక మనిషిలో లోపాన్ని సరిదిద్దుకోమనడం విమర్శ అయితే.. అదే లోపాన్ని చూసి నవ్వుకోవడం ట్రోలింగ్ అవుతుంది. ప్రతీ ట్రోలింగ్ చెడ్డది కాదు. కానీ అదే పనిగా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం మాత్రం బ్యాడ్.. వెరీ బ్యాడ్. ఇఫ్ యూ ఆర్ బ్యాడ్ ఐయామ్ యువర్ డాడ్ అన్నట్టు.. బ్యాడ్ గయ్స్ అందరికీ డాడీ అయి కూర్చున్నాడు అల్లు అర్జున్. తిట్టిన ప్రతీ నోరుని మూయించాడు. ఎత్తిన ప్రతి వేలుని దింపించాడు. గట్టిగా మాట్లాడితే కేసీపీడీ అంటారు కదా అది చేశాడు. మరి మన అల్లు అర్జున్ కథ ఏంటో తెలుసుకుందామా? 21 ఏళ్ల నాటి పగ గురించి తెలుసుకుందామా?

అది 2003వ సంవత్సరం మార్చి 28.. అల్లు అర్జున్ హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా గంగోత్రి విడుదలైన తేదీ. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అల్లు వారబ్బాయిని గౌరవంగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పాటలు, ఆ కథ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అన్నట్టే ఉంటాయి. అల్లు అర్జున్ తన 21 ఏళ్ల వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మూతి మీద మీసం కూడా మొలవలేదు. కానీ మొదటి సినిమాతోనే అదరగొట్టాడు. అయితే టాలెంట్ ని మెచ్చుకున్నవారు ఉన్నట్టే విమర్శించేవారు కూడా ఉంటారు. ఇందులో పీహెచ్డీ చేసిన వాళ్ళు ఉంటారు. వారు మాత్రం ఘోరం.

అందంగా లేనోళ్ళు కూడా వంకలు, పేర్లు పెడతారు. ఆ హీరో ఏం బాగున్నాడు? ఆ హీరో దగ్గర డబ్బుంది కాబట్టి హీరో అయిపోయాడు అని అవమానించేస్తారు. అదే డబ్బు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ల దగ్గర కూడా ఉంది. మరి వాళ్ళెందుకు హీరోలు అవ్వడం లేదు. వాళ్లకి ఇంట్రస్ట్ లేదు కాబట్టి అవ్వలేదు అంటారా? సరే ఇంట్రస్ట్ ఉండి ఇండస్ట్రీకి వచ్చి చేతులు కాల్చుకున్నవాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. డబ్బు కొంతవరకే నడిపిస్తుంది.. కొన్ని రోజులే నడిపిస్తుంది. కానీ ప్రతిభ, కష్టపడేతత్వం దశాబ్దాలు, శతాబ్దాలు నడిపిస్తాయి. అల్లు అర్జున్ విషయంలో ఇదే జరిగింది. అల్లు అర్జున్ కి అందం లేదన్నారు. ఇతనేం హీరోరా బాబు అన్నారు. ఇంకా చాలా చాలా అన్నారు. వీటన్నిటికీ ఐకాన్ స్టార్ గా ఎదిగి సమాధానం చెప్పారు. ఏం బాలేదు అన్నవారితోనే స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు. యూత్ కి ఒక ఐకాన్ స్టార్ గా ఎదిగిపోయాడు.

Allu arjun lady getup 21 years revange

ఈ క్రమంలో ఎదురైన అవమానాలు ఎన్నో. వాటిలో గంగోత్రిలో అల్లు అర్జున్ వేసిన లేడీ గెటప్ పై వచ్చిన విమర్శలు ఒకటి. ఈ గెటప్ అల్లు అర్జున్ కి బాగా సూట్ అయ్యిందని.. ఆడ, మగ కాని మనిషిలా ఉన్నాడని తిట్టారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై ద్వేషాన్ని  ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అల్లు అర్జున్ గంగోత్రి మూవీలో లేడీ గెటప్ లో ఉన్న పిక్ ని ట్రోల్ చేసి శునకానందం పొందేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే 21 ఏళ్ల క్రితం అల్లు అర్జున్ వేసిన లేడీ గెటప్ బాలేదని ఎవరైతే అన్నారో, ఎవరైతే ఇంకా అంటున్నారో వారికి అల్లు అర్జున్ పుష్ప 2 ద్వారా ఆన్సర్ ఇచ్చేశాడు. అలాంటి ఇలాంటి ఆన్సర్ కాదు.. మళ్ళీ నోరెత్తకుండా చేశాడు. అమ్మ వారి గెటప్ లో అల్లు అర్జున్ ని చూస్తుంటే ఎవరికైనా బాలేదు అని అనాలనిపిస్తుందా? నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ ది అమ్మ వారి గెటప్ లో మైండ్ బ్లోయింగ్ లుక్ అని చెప్పాలి.

Pushpa 2 teaser all time record

అల్లు అర్జున్ ఈ గెటప్ ఎందుకు వేసినట్టు? ప్రమోషన్స్ లో కూడా ఎక్కువగా ఈ గెటప్ లో ఉన్న స్టిల్సే కనబడుతున్నాయి. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజైన టీజర్ లో కూడా ఈ లేడీ (అమ్మవారి) గెటప్ నే హైలైట్ చేశారు. సుకుమార్ గానీ, అల్లు అర్జున్ గానీ ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియదు కానీ.. ఈ గెటప్ చూస్తే మాత్రం ఒకప్పుడు తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగానే అని అనిపిస్తుంది. అల్లు అర్జున్ సుక్కుకి దీని గురించి ఒక మాట చెప్పి ఒప్పించారో లేక సుకుమార్ ఏమైనా దీన్ని ఒక సవాలుగా తీసుకున్నారో తెలియదు. కానీ ఇది యాదృచ్చికంగా జరిగింది అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే పుష్ప 2 టీమ్ ప్రత్యేకించి దీని మీద శ్రద్ధ పెట్టింది అనేలా ఉన్నాయి వారి చర్యలు. ఏది ఏమైనా కానీ ఏ లేడీ గెటప్ ద్వారా అయితే తాను ట్రోలింగ్ కి గురయ్యాడో.. అదే లేడీ గెటప్ ని పుష్ప 2 మూవీలో వేసి ట్రోలర్స్ అందరికీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. 21 ఏళ్ల వయసులో ఎదురైన అవమానానికి 21 ఏళ్ల నిరీక్షణ అనంతరం ప్రతీకారం రూపంలో జవాబు దొరికింది. ఇది కదా అల్లు అర్జున్ అంటే. ఇది ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి