iDreamPost

Pushpa 2 Record: విడుదలకు ముందే పుష్ప 2 రికార్డు! ఆ భాషలో రిలీజ్ అవుతున్న తొలి తెలుగు చిత్రంగా..

పుష్ప 2 మూవీ విడుదలకు ముందే రికార్డులు కొల్లగొడోతోంది. ఓ వైపు టీజర్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తుంటే.. తాజాగా మరో ఘనతను సాధించబోతోంది. ఆ భాషలో విడుదల కాబోతున్న తొలి తెలుగు చిత్రంగా పుష్ప 2 నిలవనుంది. ఆ వివరాల్లోకి వెళితే..

పుష్ప 2 టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక టీజర్ ఇచ్చిన హైప్ తో ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ ఖాయమని సినీ పండితులు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉండగా.. విడుదలకు ముందే పుష్ప 2 ఓ రేర్ ఫీట్ ను సాధించింది. ఆ భాషలో విడుదల అవుతున్న తొలి తెలుగు చిత్రంగా నిలవనుంది. మరి ఇంతకీ పుష్పరాజ్ అడుగుపెడుతున్న ఆ బాష ఏది? తెలుసుకుందాం పదండి.

సాధారణంగా తెలుగు సినిమాలు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలతో పాటుగా పలు లాంగ్వేజీల్లో రిలీజ్ అవుతూ ఉంటాయి.. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప 2 మూవీ ఈ భాషలతో పాటుగా మరో భాషలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి వరకు తెలుగు మూవీ ఈ భాషలో రిలీజ్ కాలేదు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రంగా పుష్ప 2 రికార్డుల్లోకి ఎక్కనుంది.

ఇంతకీ ఆ భాష ఏంటంటే? బంగ్లా.. అవును బంగ్లాదేశ్ లో రిలీజ్ కాబోతున్న మెుట్టమెుదటి తెలుగు చిత్రంగా పుష్ప 2 అరుదైన ఘనతను సాధించబోతోంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా బంగ్లాదేశ్ లో విడుదల కాలేదు. ఇదిలా ఉండగా.. పుష్ప 2 టీజర్ విడుదలైన 12 గంటల్లోనే 51 మిలియన్ వ్యూస్ తో, 1 మిలియన్ కు పైగా లైక్స్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. మరి విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప 2పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Shah Rukh Khan: స్టార్ హీరోల రేంజ్ లో షారుఖ్ మేనేజర్ జీతం! ఎంతో తెలుసా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి