iDreamPost

సీఎం సంచలన నిర్ణయం.. ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు కరెంట్‌ బిల్లు చెల్లించాల్సిందే!

Assam CM: ప్రభుత్వంలో ఉండే ఉన్నత స్థాయి వ్యక్తులకు వివిధ రకాల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. తాజాగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జులై నుంచి రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి వ్యక్తులు వారి కరెంటు బిల్లులు వారే భరించాలి.

Assam CM: ప్రభుత్వంలో ఉండే ఉన్నత స్థాయి వ్యక్తులకు వివిధ రకాల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. తాజాగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జులై నుంచి రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి వ్యక్తులు వారి కరెంటు బిల్లులు వారే భరించాలి.

సీఎం సంచలన నిర్ణయం.. ఇకపై మంత్రులు, ఎమ్మెల్యేలు కరెంట్‌ బిల్లు చెల్లించాల్సిందే!

ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం అనేక రకాల సౌకర్యాలు కలిపిస్తుంది. ఎమ్మెల్యే నుంచి మంత్రుల వరకు అందరికి వివిధ రకాల బెనిఫిట్స్  ప్రభుత్వం నుంచి అందుతుంటాయి. ముఖ్యంగా వారు ప్రయాణించే వెహికల్, ఇంటికి సంబంధించిన పలు రకాల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. దీంతో అదే అదునుగా భావించే..కొందరు ప్రజాప్రతినిధులు అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలోనే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జులై నుంచి రాష్ట్రంలోని ఉన్నతస్థాయి ఉద్యోగుల నుంచి,మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరూ తమ విద్యుత్ బిల్లులను సొంత డబ్బులతో చెల్లించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇంతకీ ఆ సీఎం ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఆదివారం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికీ వరకు ప్రభుత్వ సొమ్ముతో విద్యుత్ బిల్లులు చెల్లించే ప్రజాప్రతినిధులకు, ఉన్నతస్థాయి ఉద్యోగులకు గట్టి షాకిచ్చారు. జులై నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి ఉద్యోగులు తమ కరెంట్ బిల్లులను సొంత డబ్బులతో చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. తాను,  రాష్ట్ర ప్రధానకార్యదర్శి కూడ ఈ నిబంధనను అనుసరిస్తాని ఆయన తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. గత 75 ఏళ్లుగా తమ రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సీనియర్ అధికారుల నివాసాలకు కరెంట్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. అయితే ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా  వచ్చే సొమ్ముతో ప్రభుత్వ అధికారులకు విద్యుత్ బిల్లులు చెల్లించే వీఐపీ సంప్రదాయానికి ముగింపు పలుకుతున్నామని ఆయన తెలిపారు.

తాను , రాష్ట్ర సీఎస్ కూడా జూలై నుంచి తమ విద్యుత్ బిల్లులలను తామే చెల్లించడం ప్రారభిస్తామని అస్సాం సీఎం తెలిపారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులంతా వారి కరెంట్ వినియోగానికి అయ్యే ఖర్చును వారే భరించాల్సి ఉంటుందని సీఎం బిశ్వశర్మ ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. దీనివల్ల విద్యుత్ శాఖకు వచ్చే నష్టాలను నివారించవచ్చని, అలానే కరెంట్ ఛార్జీల ధరలు పెంచాల్సిన అవసరం ఉండదని సీఎం పేర్కొన్నారు. మొత్తంగా అస్సాం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై పలువురు అభినందనలు తెలుపుతున్నారు. మరి.. అస్సాం సీఎం నిర్ణయంపై మీఅభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి