iDreamPost

సోగ్గాడి మీదే అభిమానుల ఆశలన్నీ

సోగ్గాడి మీదే అభిమానుల ఆశలన్నీ

నలుగురు సీనియర్ మోస్ట్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున గట్టిగా చెప్పుకునే హిట్టు కొట్టి అయిదేళ్ళు దాటింది. సోగ్గాడే చిన్ని నాయన బ్లాక్ బస్టర్ కాగా ఊపిరి డీసెంట్ గా బయట పడింది. దాని తర్వాత నిర్మలా కాన్వెంట్, ఓం నమో వెంకటేశాయ, రాజు గారి గది 2, ఆఫీసర్, దేవదాస్, మన్మథుడు 2, వైల్డ్ డాగ్ ఇలా ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద టపా కట్టేశాయి. కొన్ని మరీ దారుణంగా మిడిల్ రేంజ్ హీరో తెచ్చే ఫ్లాప్ వసూళ్ల కంటే తక్కువ రాబట్టడం ఫ్యాన్స్ ని బాగా బాధించింది. అందుకే ఇప్పుడు వాళ్ళ ఆశలన్నీ బంగార్రాజు మీదే ఉన్నాయి. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం యూనిట్ ప్రస్తుతం మైసూర్ లో ఉంది

Also Read: ఇదేంటి బాసూ.. నీకు ఎదురిచ్చి వెళుతున్నారా ? ఏంటి?

ఇందులో నాగార్జునతో పాటు నాగచైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. చైతుకి జోడిగా కృతి శెట్టి కనిపించనుంది. నాగ్ కు ఎవరు జత కడతారనే క్లారిటీ ఇంకా రాలేదు. రమ్యకృష్ణనే కంటిన్యూ చేస్తారా లేక ఆ మధ్య ప్రచారం జరిగినట్టు శ్రేయ శరన్ లైన్ లోకి వస్తుందా ఇంకా తేలాల్సి ఉంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇందులో అఖిల్ కూడా ఒక స్పెషల్ క్యామియో చేస్తాడట. మనం తరహాలో అలా వచ్చి ఇలా వెళ్లిపోయే పాత్ర అయినప్పటికీ కథను మలుపు తిప్పే కీలక క్రమంలో వచ్చి వెళ్తుందని ఇన్ సైడ్ టాక్. ఏజెంట్ నుంచి కాస్త బ్రేక్ దొరగ్గానే అఖిల్ తో ఈ సీన్లు తీసేలా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాడని వినికిడి.

అధికారికంగా ఇప్పుడే చెప్పరు కాబట్టి ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే. దీనికన్నా ముందు నాగార్జున ది ఘోస్ట్ విడుదల కావాల్సి ఉంది. ప్రవీణ్ సత్తారు రూపొందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై డిఫరెంట్ గా ఉందనే ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. బంగార్రాజునేమో 2022 సంక్రాంతికి ప్లాన్ చేశారని అంటున్నారు. మరి ఘోస్ట్ అంతలోపు వస్తుందా లేక ఆలస్యం చేస్తారా అనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. అక్కినేని ఫ్యామిలీ మొత్తం కనిపించిన మనం తర్వాత మళ్ళీ మరోసారి ఆ కాంబినేషన్ ని చూడాలని అభిమానులు కోరుతున్నారు. బంగార్రాజు ఈసారి ఆ కోరికని గట్టిగానే నెరవేర్చేలా కనిపిస్తోంది

Also Read: మళ్ళీ సింగ్ టైటిల్ తో పవన్ ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి