iDreamPost

సునీతా విలియమ్స్‌కి తప్పని కష్టాలు.. ఇంకా అంతరిక్షంలోనే

Sunita Williams: ఇటీవల అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆమె ల్యాండింగ్ ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. స్పేస్ షిప్ లో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్లే సునీతా ల్యాండింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.

Sunita Williams: ఇటీవల అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఆమె ల్యాండింగ్ ఇప్పుడు మరోసారి వాయిదా పడింది. స్పేస్ షిప్ లో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్లే సునీతా ల్యాండింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.

సునీతా విలియమ్స్‌కి తప్పని కష్టాలు.. ఇంకా అంతరిక్షంలోనే

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ చిక్కుల్లో పడ్డారు. పలు సాంకేతిక సమస్యల కారణంగా పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టారు. సునీతా విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్ మోర్ కూడా అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టారు. వీరిద్దరూ ప్రయాణించిన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ షిప్ జూన్ 5 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారు తిరిగి భూమ్మీదకు రావడానికి సమస్యలు తలెత్తాయి. దీంతో ల్యాండింగ్ వాయిదా పడింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు పది రోజుల మిషన్ లో భాగంగా ఈ రోదసీ ప్రయాణాన్ని ప్రారంభించారు. జూన్ 14న ఈ ఇద్దరూ భూమ్మీదకు తిరుగుపయనం కావాల్సి ఉంది.

అయితే బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ షిప్ లో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో నాసా వారి ల్యాండింగ్ ను వాయిదా వేసింది. ఆ తర్వాత జూన్ 26న ల్యాండింగ్ ఉంటుందని నాసా ప్రకటించింది. కాగా ఇప్పుడు మరోసారి వారి తిరుగు ప్రయాణం వాయిదా పడింది. కొత్త ల్యాండింగ్ తేదీని నాసా వెల్లడించలేదు కానీ అన్నీ అనుకూలిస్తే జూలై 2న తిరుగు పయనం ఉండవచ్చునని నాసా అంచనా వేస్తోంది. ఇప్పుడే కాదు.. అంతరిక్ష యాత్రకు  ముందు కూడా పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అమెరికా అంతరిక్ష సంస్థ, నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ స్పేస్ షిప్ కి ఈ రోదసీ యాత్రే మొదటి మానవ సహిత యాత్ర.

ప్రయోగం సమయంలో హీలియం లీకేజ్ కారణంగా గైడెన్స్, కంట్రోల్ థ్రస్టర్స్ లో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ ల అంతరిక్షయానం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా జూన్ 5న ప్రయోగం విజయవంతమైంది. రోదసీలోకి వెళ్లిన తర్వాత కూడా సమస్యలు వచ్చాయి. ఆలస్యంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో స్పేస్ షిప్ అనుసంధానం అయ్యింది. మొత్తానికి ఐఎస్ఎస్ కు చేరుకున్న స్పేస్ షిప్ తిరుగుప్రయాణం మాత్రం వాయిదా పడుతూ వస్తుంది. దీంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లకి కష్టాలు తప్పడం లేదు. సునీతా విలియమ్స్ కి ఇది మూడో రోదసీ యాత్ర. 2006, 2012 సంవత్సరాల్లో ఆమె అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టారు. అంతరిక్షంలో 322 రోజుల పాటు గడిపారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు. అంతరిక్ష కేంద్రంలో మారథాన్ కూడా చేశారు. ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళగానే సునీతా విలియమ్స్ సంతోషంతో డ్యాన్స్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి