iDreamPost

సుశాంత్‌ సింగ్‌ ఇల్లు కొన్న స్టార్‌ హీరోయిన్‌.. ఆ కారణం వల్లే తీసుకుందట

  • Published Jun 04, 2024 | 1:26 PMUpdated Jun 04, 2024 | 1:26 PM

Adah Sharma: విభిన్నమైన కథలు, వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ.. దూసుకుపోతన్న అదా శర్మ.. తాజాగా ఓ షాకింగ్‌ విషయం చెప్పింది. ఆమె బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఇంటిని కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఆ వివరాలు..

Adah Sharma: విభిన్నమైన కథలు, వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ.. దూసుకుపోతన్న అదా శర్మ.. తాజాగా ఓ షాకింగ్‌ విషయం చెప్పింది. ఆమె బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఇంటిని కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఆ వివరాలు..

  • Published Jun 04, 2024 | 1:26 PMUpdated Jun 04, 2024 | 1:26 PM
సుశాంత్‌ సింగ్‌ ఇల్లు కొన్న స్టార్‌ హీరోయిన్‌.. ఆ కారణం వల్లే తీసుకుందట

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌.. అభిమానులు నేటికి కూడా మర్చిపోలేని హీరో. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా.. సీరియల్స్‌లో నటిస్తూ.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుని.. అప్‌కమింగ్‌ హీరోగా జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్‌లోని బంధుప్రీతికి ధీటుగా నిలిచి.. హీరోగా అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు సుశాంత్‌ సింగ్‌. అతడికి సినీ ఇండస్ట్రీలో మంచి కెరీర్‌ ఉందని.. భవిష్యత్తులో బాలీవుడ్‌ని ఏలుతాడని.. ప్రతి ఒక్కరు భావించారు. విభిన్నమైన కథలు ఎంచుకుని.. మిగతా వారికి భిన్నంగా కెరీర్‌లో దూసుకుపోతున్న సుశాంత్‌ సింగ్‌.. అనుకోని రీతిలో.. ఆత్మహత్య చేసుకుని.. చనిపోయి.. అభిమానులకు భారీ షాక్‌ ఇచ్చాడు. అసలు అతడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనేది మిస్టీరియస్‌ క్వశ్చన్‌గా మిగిలిపోయింది. ఇలా ఉండగా తాజాగా ఈ దివంగత నటుడికి సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ ఇంటిని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది బ్యూటీ అదా శర్మ. ఈమధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. సినిమాల విషయానికి వస్తే.. మిగతా నటీమణులు చేయడానికి ధైర్యం చేయని కథల్లో నటిస్తూ.. సంచలనంగా నిలుస్తోంది అదా శర్మ. ది కేరళ ఫైల్స్‌, బస్తర్‌ వంటి సినిమాలే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో తాజాగా అదా శర్మ.. వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయంతో మరోసారి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ ఇంటిని కొనుగోలు చేసింది అదా శర్మ. ఇక తాజాగా దీనిపై స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ బ్యూటీ.

గతంలో అదా శర్మ.. బాంద్రాలోని పలి హిల్‌లోనే ఉండేదట. అక్కడి నుంచి ఎప్పుడూ బయటకు రాలేదు. కానీ ఈమధ్య కాలంలో అక్కడి నుంచి షిఫ్ట్‌ అయ్యింది అదా శర్మ. తాజాగా దీనిపై స్పందిస్తూ.. అదా శర్మ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘కేరళలో నేను ఉండే ఇల్లు చాలా విశాలంగా ఉండేది. అక్కడ పక్షులు తిరగడానికి, వాలడానికి చెట్లు ఉండి ఎంతో ప్రశాంతంగా ఉండేది. ముంబైలో అలాంటి ఇంటి కోసమే వెదుకుతున్నాను. ఈ క్రమంలో నాకు సుశాంత్‌ సింగ్‌ ఇల్లు బాగా నచ్చింది. అందుకే ఇక్కడకు మారాను. అయితే ఈ ఇంటిని పూర్తిగా మార్చి వేశాను. రీమోడలింగ్‌ చేయించి.. పెయింటింగ్‌ వేయించాను. ఒక ఫ్లోర్‌ను పూర్తిగా పూజ గదిగా మార్చేశాను. మిగతా భాగాలను డ్యాన్స్‌ రూమ్‌, మ్యూజిక్‌ రూమ్‌గా డివైడ్‌ చేశాను’’ అని చెప్పుకొచ్చింది.

ఇక ప్రస్తుతం అదా శర్మ కెరీర్‌ విషయానికి వస్తే​.. వెబ్‌సిరీస్‌లు, బాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంటుంది. ఇక కేరళ ఫైల్స్‌ సినిమాతో ఒక్క సారిగా.. నేషనల్‌ వైడ్‌గా క్రేజ్‌ దక్కించుకుంది అదా శర్మ. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓటీటీ సబ్జెక్ట్‌లకు, కాంట్రవర్సీ కథలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా నిలుస్తోంది. ఇక అదా శర్మ.. తెలుగులో డైరెక్ట్‌గా సినిమా చేసి చాలా కాలమే అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి