iDreamPost

రాజమౌళి ఆఫర్ నే రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్! కారణం ఏంటో తెలుసా?

రాజమౌళి మూవీలో చిన్న పాత్ర ఇచ్చినా.. అదృష్టంగా భావించే యాక్టర్లు ఉన్నారు. అలాంటిది ఆయన పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే రిజెక్ట్ చేసిందట స్టార్ హీరోయిన్. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆ మూవీ ఏది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రాజమౌళి మూవీలో చిన్న పాత్ర ఇచ్చినా.. అదృష్టంగా భావించే యాక్టర్లు ఉన్నారు. అలాంటిది ఆయన పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే రిజెక్ట్ చేసిందట స్టార్ హీరోయిన్. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆ మూవీ ఏది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రాజమౌళి ఆఫర్ నే రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్! కారణం ఏంటో తెలుసా?

దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో నటించాలని ఎంతో మంది స్టార్ హీరోలు ఎదురుచూస్తూ ఉంటారు. ఆయన మూవీలో ఒక్క నిమిషం పాటు కనిపించినా చాలని కలలు కనే నటీ, నటులు కూడా ఉన్నారు.  అలాంటి స్టార్ డైరెక్టర్ పిలిచి మరీ ఛాన్స్ ఇస్తానంటే చేయనని చెప్పిందట ఓ స్టార్ హీరోయిన్. దాంతో ఈ విషయం తెలిసి అవాక్కైయ్యారట ఇండస్ట్రీ ప్రముఖులు. మరి జక్కన్న ఆఫర్ నే తిరస్కరించిన ఆ హీరోయిన్ ఎవరు? ఛాన్స్ వచ్చినా నటించకపోవడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం పదండి.

ఇండస్ట్రీలో అపజయమే ఎరుగని డైరెక్టర్ గా దిగ్విజయంగా కొనసాగుతున్నాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇక ఆయన డైరెక్షన్ లో ఒక్క సినిమా చేసినా చాలని అనుకునే యాక్టర్స్ కోకొల్లలుగా ఇండస్ట్రీలో ఉన్నారు. చిన్న పాత్ర ఇచ్చినా అదృష్టంగా భావించే స్టార్లు ఉన్నారు. అలాంటిది జక్కన్నే స్వయంగా పలిచి మరీ ఛాన్స్ ఇస్తే వద్దంటారా? వద్దంటే వారంత దుదృష్టవంతులు ఇంకోరు ఉండరు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం రాజమౌళి ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు. చెన్నై చిన్నది త్రిష. రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడి గురించి తెలిసి కూడా త్రిష ఆయన ఇచ్చిన ఆఫర్ ను ఎందుకు రిజెక్ట్ చేసిందో అప్పుడు ఎవ్వరికీ అర్ధం కాలేదు. కానీ ఆమె జక్కన్న ఆఫర్ ను రిజెక్ట్ చేయడానికి పెద్ద కారణమే ఉందట.

Trisha Rejected Rajamoulis Offer

రాజమౌళి హీరోయిన్ గా త్రిషకు ఆఫర్ చేసింది పెద్ద హీరో సరసన కాదు. కమెడియన్ సునీల్ తో తాను తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం ‘మర్యాద రామన్న’ మూవీ కోసం త్రిషను అడిగాడట. కానీ ఆమె అప్పటికే స్టార్ హీరోయిన్ కావడం, తన పక్కన కమెడియన్ గా చేసిన సునీల్ పక్కన నటించడానికి సంకోచించిందట. అందుకే స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ.. ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట త్రిష. దాంతో జక్కన్న సైతం స్టార్ హీరోయిన్స్ వైపు కాకుండా కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని అనుకున్నాడు. అందులో భాగంగానే సలోనికి సూపర్ ఛాన్స్ ఇచ్చాడు జక్కన్న. అయితే ఈ మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ.. ఆ తర్వాత ఆమెకు భారీ మూవీల్లో ఆఫర్లు రాలేదు. రెండు, మూడు చిన్న చిత్రాల్లో మాత్రమే ఛాన్స్ వచ్చాయి.. ఇక ప్రస్తుతం అడపాదడపా మూవీల్లో నటిస్తోంది సలోని. మరి త్రిష జక్కన్న ఆఫర్ ను రిజెక్ట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి