iDreamPost

ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..ఇండస్ట్రీని ఊపేసిన స్టార్ హీరోయిన్!

  • Published Jun 18, 2024 | 1:38 PMUpdated Jun 18, 2024 | 1:38 PM

Pic Talk: పై ఫోటోలో స్కూల్ ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది.అలాగే లి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని అప్పట్లో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకుంది. కానీ ఆ తర్వాత ఈ వయ్యారికి ఆశించినంతగా ఆఫర్స్ రాలేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

Pic Talk: పై ఫోటోలో స్కూల్ ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది.అలాగే లి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని అప్పట్లో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకుంది. కానీ ఆ తర్వాత ఈ వయ్యారికి ఆశించినంతగా ఆఫర్స్ రాలేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

  • Published Jun 18, 2024 | 1:38 PMUpdated Jun 18, 2024 | 1:38 PM
ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..ఇండస్ట్రీని ఊపేసిన స్టార్ హీరోయిన్!

సినీ ప్రపంచం ప్రతిఒక్కరికి లైఫ్ ను ఇస్తుంది. ఇక దాన్ని నిలబెట్టుకోవడం, వదులుకోవడం అన్ని నటి, నటుల చేతిలోనే ఉంటుంది. కానీ, ఈ సినీ రంగంలో నటులుగా కొనసాగి నిలబెట్టుకొనే వారికంటే.. కనుమరుగయ్యే వారే ఎక్కువ మంది ఉన్నారు. అయితే వీరిలో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు.కానీ, వీరు చేసినవి మాత్రం తక్కువ సినిమాలే అయితనా.. ప్రేక్షకుల మదిలో చిరాస్థాయిలో గుర్తుండిపోతారు. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో వీరి అందం, అభినయంతో లక్షలాది అభిమానులను సొంతం చేసకుంటారు. కానీ, కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైంలో పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పడమో, సరిగ్గా కెరీర్ ఫ్లాన్ చేసుకోకపోవడమో తెలియదు కానీ పూర్తిగా ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ హీరోయిన్ కూడా ఒకరు. ఇంతకి పై ఫోటోలో స్కూల్ ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టారా..

ఈమె ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని అప్పట్లో కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టుకుంది. కానీ ఆ తర్వాత ఈ వయ్యారికి ఆశించినంతగా ఆఫర్స్ రాలేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు.. అందాలా తార ‘నమిత’.ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు స్టార్ హీరోయిన్లలో నమిత కూడా ఒకరు.అయితే ప్రస్తుతం ఆమె స్కూల్ డేస్ ఫోటో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్ టీనేజ్ లో కూడా నమిత చాలా అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సురత్ కు చెందిన నమిత 17 ఏళ్లకే మిస్ సూరత్‏గా ఎంపికయ్యింది. ఇక ఆ తర్వాత 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాల్గవ స్థానం సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే నటనతో ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నమిత.. 2002లో ఆర్యన్ రాజేశ్ హీరోగా నటించిన ‘సొంతం’ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమయ్యింది. ఈ సినిమా అప్పట్లో మ్యూజికల్ హిట్ అందుకుంది. దీంతో వెంటనే వెంకటేశ్ సరసన ‘జెమిని’ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో ఒక రాజు ఒక రాణి, ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి, ఐతే ఏంటీ, నాయకుడు, వ్యాపారి, జగన్మోహిని వంటి చిత్రాల్లో నటించింది. ఇక నమిత తెలుగులోనే కాకుండా.. తమిళ్ చిత్రాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ, ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో పాటు కాస్త బొద్దుగా మారిపోయింది.

దీంతో ఆఫర్స్ కనుమరుగయ్యాయి. కానీ, చాలా కాలం తర్వాత నమిత.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బిల్లా సినిమాలో సెకండ్ హీరోయిన్‏గా కనిపించింది.ఆ తర్వాత బాలయ్య నటించిన సింహా సినిమాలో మెరిసింది. అయినా అవకాశాలు అందుకోకపోవడంతో.. పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది. దీంతో కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్నా నమితా.. 2017లో నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది. వీరికి 2022లో కవలలు జన్మించారు. ప్రస్తుతం నమిత రాజకీయాల్లో బిజీగా ఉంది. మరి,ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నమిత స్కూల్ డేస్ ఫిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి