iDreamPost

‘మన్మథుడు’ సమయంలో ఆయన వల్ల ఇబ్బంది పడ్డా : నటి అన్షు అంబానీ

Anshu Ambani Viral Comments: ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ సాధించిన వారు హఠాత్తుగా కనుమరుగై పోతుంటారు. అలాంటి వారిలో మన్మథుడు హీరోయిన్ అన్షు అంబానీ ఒకరు.

Anshu Ambani Viral Comments: ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ సాధించిన వారు హఠాత్తుగా కనుమరుగై పోతుంటారు. అలాంటి వారిలో మన్మథుడు హీరోయిన్ అన్షు అంబానీ ఒకరు.

‘మన్మథుడు’ సమయంలో ఆయన వల్ల ఇబ్బంది పడ్డా : నటి అన్షు అంబానీ

ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు జీవితం ధన్యం అనుకునేవాళ్లు కోట్ల మంది ఉన్నారు. వెండితెర, బుల్లితెరపై కనిపిస్తే సెలబ్రెటీ హూదా వస్తుంది.. సొసైటీలో మంచి గౌరవం వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. ఇందుకోసం తమ టాలెంట్ చూపించుకునేందుకు స్టూడియోల వెంట పడిగాపులు కాస్తుంటారు. ఇండస్ట్రీలో ఛాన్స్ దక్కించుకోవాలంటే చాలా కష్టమన్న విషయం తెలిసిందే.. టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలని అంటుంటారు. కొంతమందికి అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి హీరో, హీరోయిన్లుగా మారుతుంటారు.. కానీ కొద్ది కాలనికే కనుమరుగైపోతుంటారు. అలాంటి హీరోయిన్స్ లో అన్షు అంబానీ ఒకరు. ఆమె ఎందుకు ఇండస్ట్రీకి దూరమైంది.. మళ్లీ ఎంట్రీ ఇస్తుందా అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

అన్షు అంబానీ ఈ పేరు వినగానే ఎవరా అని ఆలోచిస్తారు.. కానీ కింగ్ నాగార్జున నటించిన ‘మన్మథుడు’ మూవీలో హీరోయిన్ అంటే వెంటనే గుర్తుపడతారు. ఆ మూవీలో మహేశ్వరి పాత్రలో చాలా అమాయకంగా కనిపించే పాత్రలో అన్షు అంబానీ అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో ఆమె పాత్ర హైలెట్ గా నిలిచింది. అలాగే ప్రభాస్ నటించిన ‘రాఘవేంద్ర’ మూవీలో నటించింది.. చివరిగా అన్షు అంబాని ‘జై’ మూవీలో నటించింది. శివాజీ నటించిన ‘మిస్సమ్మ’మూవీలో గెస్ట్ రోల్ లో కనిపించింది. తమిళ్ లో కూడా ఓ మూవీలో నటించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన అన్షు అంబానీ కి ఎంతో గొప్ప ఫ్యూచర్ ఉన్నప్పటికీ అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమైంది. రాఘవేంద్ర మూవీ సమయంలోనే సచిన్ సగ్గర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని వైవాహికబంధంలోకి అడుగు పెట్టింది. ఆమె ఇండస్ట్రీకి దూరం కావడానికి బలమైన కారణాలే ఉన్నాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఇంగ్లాండ్ నుంచి వచ్చినపుడు ‘మన్మథుడు’ మూవీలో ఛాన్స్ వచ్చింది. ఆ సమయంలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. మన్మథుడు మూవీ సమయానికి నా వయసు 16 సంవత్సరాలు.  మా నాన్న ఎప్పుడూ నా వెంటనే నీడలా ఉండేవారు. దీంతో నేను ఏది కూడా స్వతంత్రంగా చేయలేని పరిస్థితి. ఎవరితో మాట్లాడాలన్నా, కలవాలన్నా మా నాన్న పరిమిషన్ కావాల్సిందే. ఇలాంటి పరిస్థితిలో ఇండస్ట్రీలో రాణించడం కష్టం అనిపించింది. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి వెళ్లి తిరిగి ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నా. నేను బ్రిటీష్ ఇండియన్ ని.. ఇంగ్లాండ్ లో పుట్టినప్పటికీ ఇక్కడ మా పూర్వీకుల మూలాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో నాకు పెద్దగా తెలిసినవాళ్లు లేరు.. అప్పట్లో ప్రభాస్ మాత్రమే నాకు బాగా తెలుసు. నా కూతురు బాహుబలి మూవీ చూసి చాలా సంతోష పడుతుంది. నేను నటించే సమయానికి శ్రియ, ఆర్తి అగర్వాల్, భూమిక, త్రిష ఉన్నారు.. వారితో పరిచయం ఉంది. రీసెంట్ గా గుంటూరు కారం, భగవంత్ కేసరి మూవీస్ చూశాను. మన్మథుడు మూవీ సమయంలో నాగార్జున తో పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.. ఆయన చాలా జాలీగా ఉంటారు. మళ్లీ అవకాశం వస్తే ఎవరితోనైనా నటిస్తాను’ అని తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి