iDreamPost

విక్రమ్ సినిమాకు గ్రహణం వీడిందా? 5 ఏళ్ల తర్వాత టీజర్..

  • Author Soma Sekhar Published - 11:00 AM, Mon - 25 September 23
  • Author Soma Sekhar Published - 11:00 AM, Mon - 25 September 23
విక్రమ్ సినిమాకు గ్రహణం వీడిందా? 5 ఏళ్ల తర్వాత టీజర్..

ఇండస్ట్రీలో ఓ సినిమాను ప్రారంభించి.. దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమంటే మాటలు కాదు. ఇక కొన్ని సినిమాలు సగం షూటింగ్ పూర్తి చేసుకుని ల్యాబ్ ల్లో మగ్గుతున్న విషయం మనకు తెలియనిదీ కాదు. మరికొన్ని సినిమాలు అనౌన్స్ మెంట్ తోనే ఆగిపోయిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఇలా చిన్న సినిమాలే ఆగిపోయాయి అనుకుంటే పొరపాటే. స్టార్ హీరోల సినిమాలు సైతం సగంలో, అనౌన్స్ చేసి మూలనపడ్డ మూవీస్ కూడా ఉన్నాయి. కాగా.. మరికొన్ని సినిమాలు ఏళ్లు గడిచిన తర్వాత గానీ వాటికి సంబంధించిన అప్డేట్ రాదు. తాజాగా 5 ఏళ్ల తర్వాత చియాన్ విక్రమ్ నటిస్తున్న ఓ సినిమా అప్డేట్ వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో 5 సంవత్సరాల తర్వాత విక్రమ్ మూవీకి గ్రహణం వీడిందా? అని ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. మరి ఇంతకీ ఆ మూవీకి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

భారతీయ ఇతిహాసాలు అయిన రామాయణం, మహాభారతాల ఆధారంగా ఎన్నో సినిమాలు తెరకెక్కాయి.. భవిష్యత్ లో కూడా తెరకెక్కనున్నాయి. అలా మహాభారతం అధారంగా విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సూర్యపుత్రన్ కర్ణన్’. 5 ఏళ్ల క్రితం ఆర్ఎస్ విమల్ దర్శకత్వంలో ఈ సినిమాని ప్రకటించిన విషయం దాదాపు అందరూ మర్చిపోయే ఉంటారు. అప్పట్లోనే ఈ మూవీని దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తారని ప్రచారం కూడా సాగింది. విక్రమ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల రెగ్యూలర్ షూటింగ్ ఇంకా పూర్తికాలేదు. దీంతో సినిమా అటకెక్కిందని అందరూ అనుకున్నారు.

కానీ సూర్యపుత్రన్ కర్ణన్ సినిమాకు 5 ఏళ్ల తర్వాత గ్రహణం వీడినట్లుగా కనిపిస్తోంది. దీనికి కారణం చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేయడమే. అద్భుతమైన మేకింగ్ తో అబ్బురపరిచాడు డైరెక్టర్. ఇక విక్రమ్ గెటప్ కూడా అదరహో అనిపిస్తోంది. ఇటీవలే సూర్యపుత్రన్ కర్ణన్ రోలింగ్ అంటూ డైరెక్టర్ విమల్ విక్రమ్ ఫొటోను షేర్ చేశాడు. తాజాగా టీజర్ కూడా విడుదల చేయడంతో.. సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు హింట్ ఇచ్చారు మేకర్స్. దీంతో ఈ సినిమాకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగినట్లే అని ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఐదు సంవత్సరాల తర్వాత మూవీ టీజర్ రిలీజ్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి