iDreamPost

Sajid Khan: ఇండస్ట్రీలో మరో విషాదం.. నటుడు కన్నుమూత

సినిమా ఇండస్ట్రీలో ఈ నెలలో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. ప్రముఖ నటీనటులు కన్నుమూయడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు.

సినిమా ఇండస్ట్రీలో ఈ నెలలో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. ప్రముఖ నటీనటులు కన్నుమూయడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు.

Sajid Khan: ఇండస్ట్రీలో మరో విషాదం.. నటుడు కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనారోగ్య సమస్యలు, వయోభారం, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు ఇలా పలు కారణాలతో నటీనటులు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు.. అభిమానులు సైతం విషాదంలో మునిగిపోతున్నారు. గత వారం తమిళ స్టార్ కమెడియన్ బోండా మణి కన్నుమూశారు. ఆ విషాదం నుంచి కోలుకోక ముందే.. తమిళ నటుడు విజయ్ కాంత్ కన్నుమూసిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.. అంతలోనే కరనా రావడంతో చెన్నైలోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో తమిళ ఇండస్ట్రీ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఒకప్పుడు ఆస్కార్ నామినేషన్ కి ఎంపికైన బాలీవుడ్ మూవీ ‘మదర్ ఇండియా’ మూవీలో నటుడు కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

1957 లో వచ్చిన ‘మదర్ ఇండియా’ చిత్రంలో సునీల్ దత్ క్యారెక్టర్ బిర్జుగా చిన్ననాటి పాత్ర పోషించిన నటుడు సాజిద్ ఖాన్ క్యాన్సర్ కారణంగా మరణించారు. వయసు 71 సంవత్సరాలు. శుక్రవారం  22, డిసెంబర్ 2023న మరణించినట్లు ఆయన కుమాడు సమీర్ ఆలస్యంగా ధృవీకరించారు. సాజిద్ ఖాన్ ‘మాయ’ , ‘ది సింగింగ్ ఫిలిపినా’ వంటి అంతర్జాతీయ చిత్రాలలో కూడా నటించారు. సాజీత్ ఖాన్ అత్యంత పేద కుటుంబలో జన్మించారు.  ఆయన తల్లిదండ్రులు ముంబైలోని మురికివాడలో పనిచేసి జీవించేవారు. తన తండ్రి గురించి సమీర్ మాట్లాడుతూ.. ‘మా నాన్న చిన్నప్పుడు పితాంబర రాణా, సునితా పితాంబర దత్తత తీసుకున్నారు. మదర్ ఇండియా సినిమా తర్వాత నటుడు, చిత్రనిర్మాత మహబూబ్ ఖాన్, సర్దార్ అక్తర్ నాన్నను దత్తత తీసుకున్నారు. మెహబూబ్ ఖాన్ స్వయంగా నాన్నకు సాజిద్ ఖాన్ అని పేరు పెట్టారు’ అని అన్నారు.

bollywood actor sajid khan passed away

1964లో తన తండ్రి మరణం తర్వాత, సాజిద్ అమెరికాకు వెళ్లి అక్కడ తన తదుపరి విద్యను అభ్యసించాడు. 1966లో వచ్చిన ‘మాయ’ సినిమాతో సాజిద్ ఖాన్ అమెరికాలో ఫేమస్ అయ్యాడు. అప్పట్లో సాజిత్ ఖాన్ చాలా హ్యాండ్సమ్ గా ఉండేవారు.. అందుకే ఆయన ఫోటోలు మ్యాగజైన్ లో కవర్ పేజీగా వేసేవారు. 1968లో టెలివిజన్ లో ప్రసారమైన ‘ది బిగ్ వ్యాలీ’లో అతిథి పాత్రలో నటించాడు, ఇట్స్ హ్యాపెనింగ్ అనే మ్యూజిక్ వెరైటీ షోలో గెస్ట్ జడ్జిగా వ్యవహరించారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాజీద్ ఖాన్ మరణంపై బాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి