iDreamPost
android-app
ios-app

టీమిండియా చెత్త రికార్డు.. T20 హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్!

  • Published Jul 06, 2024 | 9:01 PM Updated Updated Jul 06, 2024 | 9:01 PM

India vs Zimbabwe: టీ20 ప్రపంచ కప్ నెగ్గిన జోష్​లో ఉన్న భారత జట్టుకు జింబాబ్వే ఊహించని షాక్ ఇచ్చింది. మెన్ ఇన్ బ్లూను పసికూన ఓడించింది. ఈ మ్యాచ్​తో ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది భారత్.

India vs Zimbabwe: టీ20 ప్రపంచ కప్ నెగ్గిన జోష్​లో ఉన్న భారత జట్టుకు జింబాబ్వే ఊహించని షాక్ ఇచ్చింది. మెన్ ఇన్ బ్లూను పసికూన ఓడించింది. ఈ మ్యాచ్​తో ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది భారత్.

  • Published Jul 06, 2024 | 9:01 PMUpdated Jul 06, 2024 | 9:01 PM
టీమిండియా చెత్త రికార్డు.. T20 హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్!

టీ20 ప్రపంచ కప్ గెలిచాం.. ఇక మనకు తిరుగులేదని అనుకున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా లాంటి టాప్ టీమ్స్​నే మట్టికరిపించాం.. ఇక మనకు ఎదురెవరని భ్రమపడ్డారు. కానీ ఐసీసీ ట్రోఫీ నెగ్గి జోష్​లో ఉన్న భారత జట్టుకు ఓ పసికూన షాక్ ఇచ్చింది. ఎంతటి టీమ్ అయినా సరే సరిగ్గా ఆడకపోతే ఓటమి తప్పదని హెచ్చరికలు పంపించింది. ఆ జట్టు మరేదో కాదు.. జింబాబ్వే. ఐదు టీ20ల సిరీస్ కోసం ఆ దేశ పర్యటనకు వెళ్లిన యంగ్ ఇండియాకు తొలి మ్యాచ్​లోనే గట్టి షాక్ తగిలింది. ఛాంపియన్స్ అయిన భారత్​ను 13 పరుగుల తేడాతో ఓడించింది జింబాబ్వే. ఈ మ్యాచ్​తో ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది మెన్ ఇన్ బ్లూ.

జింబాబ్వేతో మ్యాచ్​లో 115 పరుగుల టార్గెట్​ను ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన భారత్.. 102 పరుగులకే కుప్పకూలింది. టీ20 హిస్టరీలో ఏ జట్టు కూడా టీమిండియాను ఇంత తక్కువ స్కోరుకు డిఫెండ్ చేసిన దాఖలాలు లేవు. ఆ రకంగా ఓ చెత్త రికార్డును అకౌంట్​లో వేసుకుంది మెన్ ఇన్ బ్లూ. ఈ మ్యాచ్​లో బ్యాటింగ్ కొలాప్స్ భారత్ కొంపముంచింది. అభిషేక్ శర్మ, రింకూ సింగ్ డకౌట్ అయ్యారు. శుబ్​మన్ గిల్ (31), వాషింగ్టన్ సుందర్ (27) మినహా మరే బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయాడు. అటు బౌలర్లు రాణించినా చివర్లో రన్స్ లీక్ చేయడం, దారుణమైన ఫీల్డింగ్, అనుభవం లేని గిల్ సారథ్యం జట్టుకు మైనస్​గా మారాయి. మరి.. జింబాబ్వే చేతిలో భారత్ పరాజయంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.