Nidhan
India vs Zimbabwe: టీ20 వరల్డ్ కప్ నెగ్గి జోష్‌లో ఉన్న టీమిండియాకు జింబాబ్వే ఊహించని షాక్ ఇచ్చింది. ఆ టీమ్‌తో జరిగిన తొలి టీ20లో మెన్ ఇన్ బ్లూ ఓటమిపాలైంది.
India vs Zimbabwe: టీ20 వరల్డ్ కప్ నెగ్గి జోష్‌లో ఉన్న టీమిండియాకు జింబాబ్వే ఊహించని షాక్ ఇచ్చింది. ఆ టీమ్‌తో జరిగిన తొలి టీ20లో మెన్ ఇన్ బ్లూ ఓటమిపాలైంది.
Nidhan
టీ20 వరల్డ్ కప్ నెగ్గి జోష్‌లో ఉన్న టీమిండియాకు జింబాబ్వే ఊహించని షాక్ ఇచ్చింది. ఆ టీమ్‌తో జరిగిన తొలి టీ20లో మెన్ ఇన్ బ్లూ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన శుబ్‌మన్ గిల్ ఆతిథ్య జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆ జట్టు ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 115 పరుగులు చేసింది. రవి బిష్ణోయ్ 4 వికెట్లతో జింబాబ్వే వెన్ను విరిచాడు. మన టీమ్‌లో తోపు బ్యాటర్లు ఉండటంతో ఈ స్కోరును ఊదిపారేస్తారని అంతా అనుకున్నారు. కానీ జింబాబ్వే బౌలర్ల దెబ్బకు మన టీమ్ 102 పరుగులకే కుప్పకూలింది. శుబ్‌మన్ గిల్ (31), వాషింగ్టన్ సుందర్ (27) తప్పితే ఒక్కరు కూడా రెండంకెల స్కోరును దాటలేకపోయారు. పేసర్ చటారా భారత్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో మన టీమ్ ఓటమికి గల 5 కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
భారత్ ఓటమికి కారణాల్లో బౌలర్ల వైఫల్యం ఒకటి. అద్భుతంగా బౌలింగ్ చేసినా ఆఖర్లో రన్స్ లీక్ చేసి జింబాబ్వేకు పోరాడే అవకాశం ఇచ్చింది బౌలర్లే. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 90 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ టీమ్ ఇంకో నాలుగైదు పరుగులు చేస్తే గొప్పని అంతా అనుకున్నారు. కానీ చివరి వికెట్‌కు ఏకంగా 25 పరుగులు చేసింది. మన టీమ్ ఓడింది 13 పరుగుల తేడాతో కావడం గమనార్హం. చివర్లో బౌలర్లు రన్స్ కాపాడి ఉంటే మ్యాచ్ రిజల్ట్ మరోలా ఉండేది. టీమిండియా ఓటమికి రెండోది అలాగే మెయిన్ రీజన్ బ్యాటింగ్ కొలాప్స్. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, ధృవ్ జురెల్ లాంటి ఐపీఎల్ స్టార్లు.. కఠిన పిచ్‌పై పరుగులు చేయలేక బ్యాట్లు ఎత్తేశారు. గిల్ (31), సుందర్ (27) రాణించకపోతే భారత్ 50 పరుగులకే చాప చుట్టేసేది.
గిల్, సుందర్ మినహా మరే బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించలేదు. పిచ్‌పై సెటిలైతే పరుగులు వచ్చే ఛాన్స్ ఉన్నా అందుకు తగ్గట్లు ఆడలేదు. మన టీమ్ ఫెయిల్యూర్‌కు మరో కారణం సుందర్. బౌలింగ్‌లో 2 వికెట్లు తీసిన అతడు.. ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చి 24 పరుగులు చేశాడు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్లో మంచి ఎక్స్‌పీరియెన్స్ ఉన్న ఈ ఆల్‌రౌండర్ మ్యాచ్‌ను ముగించే అవకాశాన్ని యూజ్ చేసుకోలేదు. అతడు బాగా స్ట్రైక్ రొటేట్ చేసి ఇంకొన్ని భారీ షాట్లు ఆడితే జింబాబ్వే మీద మరింత ప్రెజర్ పెరిగి తప్పు చేసేది. కానీ సుందర్ ఒత్తిడికి లోనై మ్యాచ్‌ను ఫినిష్ చేయలేకపోయాడు. పిచ్, కండీషన్స్‌ను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం కూడా జట్టుకు మైనస్‌గా మారింది. అలాగే పలు క్యాచ్‌లు మిస్ చేయడం, ఫీల్డింగ్‌లో రన్స్ లీక్ చేయడం కూడా మన టీమ్‌ను దెబ్బతీసింది. కొత్త కెప్టెన్ గిల్ బౌలింగ్ రొటేషన్, ఫీల్డింగ్ ఛేంజెస్‌లో బలహీనంగా కనిపించాడు. అతడి కొన్ని డిసిషన్స్ మిస్‌ఫైర్ అయ్యాయి. మరి.. భారత్ ఓటమికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
Zimbabwe defended the lowest ever total against India in T20i history. 🤯
– Some commendable performance by Zimbabwe. 👏 pic.twitter.com/vNrzTG2luq
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 6, 2024