iDreamPost
android-app
ios-app

స్టేజ్‌పై శేఖర్ మాస్టర్ కన్నీరు! ఇది కదా నిజమైన ఎమోషన్ అంటే!

  • Published Jul 06, 2024 | 8:01 PM Updated Updated Jul 06, 2024 | 8:01 PM

Sekhar Master Crying: శేఖర్ మాస్టర్ సక్సెస్ ఫుల్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నారు. సినిమా పాటలకు తనదైన స్టెప్పులతో, అద్భుతమైన కొరియోగ్రఫీతో నిత్యం జనాల్లో నానుతున్నారు. ఒకపక్క సినిమాలు చేస్తూనే పలు షోస్ లో కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఢీ డ్యాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కాగా తాజాగా రిలీజైన ప్రోమోలో శేఖర్ మాస్టర్ స్టేజ్ పైనే కన్నీరుపెట్టుకున్నారు. కారణమేంటంటే?

Sekhar Master Crying: శేఖర్ మాస్టర్ సక్సెస్ ఫుల్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నారు. సినిమా పాటలకు తనదైన స్టెప్పులతో, అద్భుతమైన కొరియోగ్రఫీతో నిత్యం జనాల్లో నానుతున్నారు. ఒకపక్క సినిమాలు చేస్తూనే పలు షోస్ లో కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఢీ డ్యాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కాగా తాజాగా రిలీజైన ప్రోమోలో శేఖర్ మాస్టర్ స్టేజ్ పైనే కన్నీరుపెట్టుకున్నారు. కారణమేంటంటే?

  • Published Jul 06, 2024 | 8:01 PMUpdated Jul 06, 2024 | 8:01 PM
స్టేజ్‌పై శేఖర్ మాస్టర్ కన్నీరు! ఇది కదా నిజమైన ఎమోషన్ అంటే!

బుల్లితెరపై ఎన్నో రియాలిటీ షోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కామెడీ షోలు, గేమ్ షోలు, డ్యాన్స్ షోలు ఇలా పలు రకాల షోస్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాంటి షోస్ లో ఢీ డ్యాన్స్ షో ఒకటి. సక్సెస్ ఫుల్ గా 17 సీజన్లను పూర్తి చేసుకున్న ఢీ షో ఇటీవల ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2’ సీజన్ లో అడుగుపెట్టింది. ఈ షోకి శేఖర్ మాస్టర్, హన్సిక, గణేష్ మాస్టర్ లు జడ్జిలుగా ఉండగా.. హైపర్ ఆది, శ్రీ సత్య టీమ్ లీడర్లుగా ఉన్నారు. ఢీ సెలబ్రిటీ స్పెషల్ 1 డ్యాన్స్ షోకి హోస్ట్ గా ఉన్న నందునే ఇక ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ డ్యాన్స్ షోలో కంటెస్టెంట్లు తమ అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఇక హైపర్ ఆది తనదైన పంచులతో షోని రక్తి కట్టిస్తున్నారు.

కామెడీకి కామెడీ, డ్యాన్స్ కి డ్యాన్స్ రెండూ ఈ షోలో దొరుకుతుండగా.. ఇరు వర్గాల ప్రేక్షకులని ఈ షో కట్టి పడేస్తుంది. ఇదిలా ఉంటే షోస్ అన్నాక ప్రోమోలు వదలడం మామూలే. ఆ ప్రోమోల్లో చివరన ఒక ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది. అది లేకపోతే ప్రోమో హైలైట్ అవ్వదు. కొన్ని ప్రోమోలు కావాలని పబ్లిసిటీ కోసం చేసినట్టు ఉంటే కొన్ని మాత్రం సీరియస్ గానే ఉంటాయి. తాజాగా విడుదలైన ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 ప్రోమో కూడా అలానే అనిపిస్తుంది. ఈ ప్రోమోలో శేఖర్ మాస్టర్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తనకు డ్యాన్స్ అంటే ఎంత పిచ్చో అనే విషయాన్ని ఈ ప్రోమోలో వెల్లడించారు. చాలా మంది ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు తాము వచ్చిన దారిని మర్చిపోరు.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంత ఆకలితో అయితే ఉన్నారో.. ఎంత కష్టపడి పనిచేశారో.. క్రేజ్ వచ్చిన తర్వాత కూడా అంతే ఆకలితో, అంతే కష్టపడేతత్వంతో ఉంటారు. మొదట్లో ఉన్న అంకితభావాన్ని అలానే కొనసాగిస్తుంటారు. శేఖర్ మాస్టర్ కూడా ఇదే విషయాన్ని గుర్తు చేశారు. చేసే పనిని ఎంతో అంకితభావంతో పని చేయాలన్న ఉద్దేశంతో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఈ షోలో మధు అనే కంటెస్టెంట్ అండ్ టీమ్ ఒక సాంగ్ కి డ్యాన్స్ చేస్తున్నారు. మధ్యలో ఒక పొరపాటు జరిగింది. దీంతో ఆయన డ్యాన్స్ చేయడం ఆపేశారు. దీంతో శేఖర్ మాస్టర్ స్పందించాల్సి వచ్చింది.

‘ఇది కాంపిటీషన్ మధు. అతని మిస్టేక్ ఉన్నా కంటిన్యూ చేయాలి. మేము డ్యాన్సర్లం కదా.. మాకు డ్యాన్స్ తప్ప ఏమీ రాదు. డ్యాన్స్ మిస్ అయిపోతే మాస్టర్ ఎక్కడ వెళ్ళిపోతాడా? మాస్టర్ వెళ్ళిపోతే మాకెక్కడ అవకాశం పోతుందా?’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇన్ని దాటుకుంటూ వచ్చి సక్సెస్ అయితే.. ఫైనల్ టాస్క్ లో డ్యాన్సర్లు అరిస్తే ఆ ఆనందమే వేరు అని ఆయన ఉద్దేశాన్ని ఈ సంఘటన ద్వారా పంచుకున్నారు. అనుక్షణం డ్యాన్స్ గురించే ఆలోచించేవాళ్లమని ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని కన్నీళ్ల ద్వారా చెప్పారు. దీంతో స్టేజ్ పై ఉన్న డ్యాన్సర్లు భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ ప్రోమోకి సంబంధించిన ఎపిసోడ్ జూలై 10, 11 తేదీల్లో ప్రసారం కానుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss