iDreamPost
android-app
ios-app

మహిళల కోసం బెస్ట్ EV.. సింగిల్ ఛార్జ్ తో 110KM రేంజ్.. ధర ఎంతంటే

Hero vida v1 electric scooters: మీరు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనుకుంటున్నారా? అయితే మహిళల కోసం బెస్ట్ ఈవీ అందుబాటులో ఉంది. సింగిల్ ఛార్జ్ తో 110 కి.మీల వరకు ప్రయాణించొచ్చు.

Hero vida v1 electric scooters: మీరు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనుకుంటున్నారా? అయితే మహిళల కోసం బెస్ట్ ఈవీ అందుబాటులో ఉంది. సింగిల్ ఛార్జ్ తో 110 కి.మీల వరకు ప్రయాణించొచ్చు.

మహిళల కోసం బెస్ట్ EV.. సింగిల్ ఛార్జ్ తో 110KM రేంజ్.. ధర ఎంతంటే

టూవీలర్ అనేది ఆఫీసులకు వెళ్లే వారికి ఇతర పనులు చేసుకునే వారి జీవితాల్లో భాగమైపోయింది. టూవీలర్ ఉన్నట్లైతే ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు వెళ్లే వీలుంటుంది. టూవీలర్ తయారీ కంపెనీలు వాహనదారుల అభిరుచులకు తగ్గట్టుగా అద్భుతమైన ఫీచర్లు, స్టన్నింగ్ డిజైన్ తో బైక్ లను, స్కూటర్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. అయితే బైక్ ల కంటే ఎక్కువగా స్కూటీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు మోటరిస్టులు. బైక్ లతో పోలిస్తే.. స్కూటీ డ్రైవింగ్ ఈజీగా ఉండడం, గేర్ లెస్ కావడంతో పురుషులతో పాటు మహిళలు కూడా స్కూటీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో మహిళల కోసం అద్భుతమైన స్కూటీ అందుబాటులో ఉంది. హీరో నుంచి విడా1 ఎలక్ట్రిక్ స్కూటర్ మహిళల కోసం బెస్ట్ అని అంటున్నారు నిపుణులు.

ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతున్నది. బడ్జెట్ ధరల్లోనే ఈవీలు వస్తుండడంతో ఆదరణ పెరిగింది. ప్రయాణ ఖర్చు తగ్గించుకునేందుకు, పెట్రోల్ ఖర్చులనుంచి ఉపశమనం పొందేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. మంచి మైలేజీ కోరుకునే వారికి హీరో కంపెనీ నుంచి వచ్చిన విడా లైనప్‌లో మంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. హీరో విడా1 ప్లస్‌, విడా 1ప్రో అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. ఈ హీరో విడా వి1 ప్లస్ మోడల్‌లో 3.44 కిలోవాట్ల బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీల వరకు ప్రయాణించొచ్చు.

ఇక విడా వి1 ప్రో వేరియంట్ 3.94 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లో అందుబాటులోకి రానుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కి.మీల వరకు ప్రయాణించొచ్చు. గంటకు 80కి.మీల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్లలో ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ లైటింగ్, స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్ వంటి అనేక ఫీచర్లు కలిగి ఉంది. భద్రత కోసం డిస్క్ మరియు డ్రమ్ బ్రేకులు మరియు 12-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది. ఈ స్కూటర్‌ ధరలు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉన్నాయి.