iDreamPost
android-app
ios-app

విషాదం: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్య

  • Published Jul 06, 2024 | 3:25 PM Updated Updated Jul 06, 2024 | 3:30 PM

Swapna Varma.. ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఆరు నెలల కాలంలో పలువురు సినీ సెలబ్రిటీలు మరణించిన సంగతి విదితమే. కానీ ఇప్పుడు ఓ మహిళా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దారుణ నిర్ణయం తీసుకుంది.

Swapna Varma.. ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఆరు నెలల కాలంలో పలువురు సినీ సెలబ్రిటీలు మరణించిన సంగతి విదితమే. కానీ ఇప్పుడు ఓ మహిళా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దారుణ నిర్ణయం తీసుకుంది.

  • Published Jul 06, 2024 | 3:25 PMUpdated Jul 06, 2024 | 3:30 PM
విషాదం: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్య

టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. మహిళా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ (33) ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని మాదాపూర్ వద్ద ఉన్న కావూరి హిల్స్‌లో తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తుంది స్వప్న. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి అని సమాచారం. ఇండస్ట్రీలో రాణించాలన్న ఉద్దేశంతో మూడేళ్ల క్రితం.. హైదరాబాద్ వచ్చింది.  గత ఏడాది ఆమె కావూరి హిల్స్‌లోని తీగల హౌస్ అపార్ట్‌మెంట్‌ 101 ఫ్లాట్‌లో నివాసముంటుంది. అయితే రెండు రోజుల నుండి ఆమె బయటకు రాలేదు.

అంతలో ఆమె గది నుండి వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. పోలీసులు వచ్చి చూడగా.. ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు  తరలించారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత ఆరు నెలలుగా సినిమా పరిశ్రమలో ఎలాంటి ప్రాజెక్టు లేకుండా ఖాళీగా ఉండటంతో ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఆర్థిక సమస్యలు వెంటాడటంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు సినీ సెలబ్రిటీలు బలవన్మరణాలకు పాల్పడిన సంగతి విదితమే. ఉదయ్ కిరణ్ నుండి నిన్నటి బుల్లితెర నటుడు చందు వరకు ఎంతో మంది స్టార్లు ఆత్మహత్య చేసుకున్నారు.

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom